News May 25, 2024
విశాఖ: వాల్తేర్ రైల్వే డివిజన్‌కు ప్రథమ స్థానం

రాజభాష అమలు చేసే ప్రధాన కార్యాలయాల జాబితాలో వాల్తేరు రైల్వే డివిజన్ ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకుంది. డివిజన్‌కు చెందిన ఆరుగురు అధికారుల కృషి ఫలితంగా ఈ బహుమతిని సొంతం చేసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉద్యోగులకు వివిధ రకాల హిందీ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో విజేతలైన వారికి డివిజనల్ రైల్వే మేనేజర్ అఫీషియల్ లాంగ్వేజ్ ఇంప్లిమెంటేషన్ కమిటీ ఛైర్మన్ సౌరబ్ ప్రసాద్ ప్రశంసా పత్రాలు అందజేశారు.
Similar News
News November 10, 2025
విశాఖ: హ్యూమన్ ట్రాఫికింగ్.. ఇద్దరి అరెస్ట్

రైలులో పసి పిల్లలను భిక్షాటన చేయించే గ్యాంగ్‌ను వాల్తేరు RPF/CPDS బృందం పట్టుకుంది. ఆపరేషన్ యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్‌లో భాగంగా చేసిన దాడిలో ఐదుగురు చిన్నారులను రక్షించి, ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. సుధా కుమారి అలియాస్ శాంత, సుఖ్ బాయి ధడి చిన్నారులను ఛత్తీస్‌గఢ్ నుంచి డబ్బు ప్రలోభాలతో విశాఖకు తీసుకువచ్చినట్టు విచారణలో తెలింది. కేసు GRP/విశాఖలో నమోదు చేశారు. అనంతరం ఖరోరా PSకు బదిలీ చేశారు.
News November 10, 2025
శబరిమలకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

విశాఖపట్నం నుంచి శబరిమల వెళ్లే భక్తుల కోసం ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీలతో బస్సులు నడుపుతోందని రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. పంచరామాల యాత్రలా శబరిమలైకి కూడా విశేష స్పందన లభించిందన్నారు. నవంబర్ 19-23 వరకు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల సందర్భంగా డిమాండ్ మేరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు చెప్పారు. బస్సుల వివరాల కోసం ద్వారక బస్ స్టేషన్లో సంప్రదించాలన్నారు.
News November 9, 2025
షీలా నగర్ జంక్షన్లో యాక్సిడెంట్.. ఒకరి మృతి

షీలా నగర్ జంక్షన్లో ఆదివారం రాత్రి బైక్‌పై వెళుతున్న వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిచెందిన వ్యక్తి తల పూర్తిగా నుజ్జునుజ్జు అవ్వడంతో గుర్తించడానికి వీలు లేని విధంగా అయిపోయింది. పోలీసులు వివరాల సేకరిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి సమాచారం తెలియల్సి ఉంది. గాజువాక ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలంలో ఉన్నారు.


