News November 25, 2024
విశాఖ: విదర్భపై చండీగఢ్ ఘనవిజయం
విశాఖ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ముస్తాక్ ఆలీ టీ-20లో సోమవారం చండీగఢ్-విదర్భ జట్లు తలబడ్డాయి. ఈ మ్యాచ్‌లో చండీగఢ్ జట్టు ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన చండీఘడ్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. అనంతరం విదర్భ జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. చండీఘడ్ జట్టులో శివం బాంబ్రి 40 బంతుల్లో 75 పరుగులు చేశారు.
Similar News
News December 5, 2024
విశాఖ: ఆటో.. అగ్గిపుల్ల.. ఓ అంగన్వాడీ టీచర్..!
అక్కయ్యపాలెంలో అంగన్వాడీ టీచర్ రహీమున్నీసాబేగంపై <<14787594>>పెట్రోల్ దాడి<<>> ఘటనలో సంగీత అనే మహిళపై కేసు నమోదైంది. గోపాలపట్నంకి చెందిన సంగీత, రహిమున్నీసాబేగంకి రూ.35 వేలు అప్పుగా ఇచ్చింది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడంతో బుధవారం పెట్రోల్ తీసుకుని అంగన్వాడీ కేంద్రానికి వచ్చింది. ఇద్దరూ <<14788224>>ఆటోలో<<>> కూర్చొని మాట్లాడుతుండగా.. పెట్రోల్ పోసి అగ్గిపుల్లతో నిప్పంటించినట్లు పోలీసుల విచారణలో వెల్లడయ్యింది.
News December 5, 2024
నేడు విశాఖ రానున్న సీఎం చంద్రబాబు.. షెడ్యూల్ ఇదే
సీఎం చంద్రబాబు నేడు విశాఖ రానున్న నేపథ్యంలో ఆయన పర్యటన షెడ్యూల్‌ను సీఎంవో తెలిపింది. ఈరోజు రాత్రి 9.40 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన టీడీపీ పార్టీ ఆఫీసుకు వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. 6వ తేదీన విశాఖ మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమాలపై సీఎం సమీక్షిస్తారు.
News December 5, 2024
అనకాపల్లి: రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు
అనకాపల్లి జిల్లా పరిధిలో నేషనల్ హైవే, స్టేట్ హైవేలపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు SDPO శ్రావణి పేర్కొన్నారు. ఈ మేరకు అనకాపల్లి నేషనల్ హైవే పై బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి ప్రమాదాలు జరగడానికి గల కారణాలను విశ్లేషించారు. లోటుపాట్లను తెలుసుకొని వాటిని సరిదిద్ది ప్రమాదాల నివారణకు వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కృషి చేస్తామన్నారు.