News October 28, 2024

విశాఖ: విమ్స్‌లో న్యూరో వైద్య శిబిరం

image

వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా విమ్స్‌లో బుధవారం ఉచిత న్యూరో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు ఒక ప్రకటనలో తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్, నరాల సమస్యలు, మూర్ఛ వ్యాధి, తలనొప్పి, పక్షవాతం, చిన్నపిల్లలకు మానసిక వైకల్యం తదితర రోగాలను నిర్ధారించే వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అవసరమైన వారికి మందులు కూడా ఉచితంగా అందజేస్తామన్నారు. >Share it

Similar News

News November 7, 2025

విశాఖ కలెక్టరేట్లో వందేమాతరం వేడుకలు

image

విశాఖ కలెక్టరేట్లో శుక్రవారం ఉదయం వందేమాతరం గీతాన్న ఆలపించారు. బంకించందర చటర్జి వందేమాతరాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించారు. విద్యార్థులతో పాటు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఉన్నతాధికారితో కలిసి వందేమాతరం గీతాన్ని ఆలపించారు. వందేమాతర గీతం స్వతంత్ర్య స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.

News November 7, 2025

ఆనందపురం: అనుమానాస్పద స్థితిలో కార్పెంటర్ మృతి

image

ఆనందపురం మండలం నేలతేరు గ్రామానికి చెందిన కడియం కనకరాజు (53) గురువారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కార్పెంటర్‌గా పనిచేస్తున్న అతను ఆనందపురం గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ నిర్మాణానికి వెళ్లగా అక్కడ మృతి చెందాడు. మొదట సహజ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు తర్వాత అనుమానం వ్యక్తం చేసి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News November 7, 2025

విశాఖను డ్రగ్స్‌కు అడ్డగా మార్చారు: పట్టభి రామ్

image

విశాఖ డ్రగ్స్ కేసులో YCP విద్యార్థి నాయకుడు కొండా రెడ్డి అరెస్టుతో రాజకీయాలు వేడెక్కాయి. TDP నేత పట్టాభి రామ్ గురువారం మాట్లాడుతూ .. ‘YCP యువజన విభాగం డ్రగ్స్ ముఠాగా మారింది. జగన్ హయాంలో విశాఖను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారు’అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘కొండా రెడ్డి అరెస్టు అక్రమం. ప్రభుత్వం కక్షతో YCP నేతలను టార్గెట్ చేస్తోంది’ అని ఆరోపించారు.