News October 12, 2024

విశాఖ: వివాహితకు బ్లాక్‌మెయిల్.. యువకుడు అరెస్టు

image

విశాఖకు చెందిన వివాహిత వ్యక్తిగత ఫొటోలు ఆమె కుటుంబ సభ్యులకు పంపించి వేధిస్తున్న ఆర్. రాజేశ్ అనే యువకుడిని సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఇన్ స్టాలో పరిచయమైన యువకుడు.. వీడియో కాల్ మాట్లాడుతూ దుస్తులు తీయాలని చెప్పాడు. ఆ సమయంలో స్క్రీన్ షాట్ తీసి డబ్బులివ్వాలని బెదిరించాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో ఫేక్ వాట్సప్ అకౌంట్ ద్వారా కుటుంబ సభ్యులకు ఫొటోలు పంపించడంతో ఫిర్యాదు చేసింది.

Similar News

News November 10, 2024

అరకు కాఫీ.. విశాఖ స్టీల్‌ప్లాంట్.. తెన్నేటి మార్కే..!

image

తెన్నేటి విశ్వనాథం విశాఖ జిల్లా అభివృద్ధిలో తనదైన మార్క్ చూపించారు. 1937లో మొదటిసారి మద్రాసు శాసనసభకు ఎన్నికైన ఆయన.. విశాఖ-1 MLAగా, విశాఖ MPగా గెలుపొందారు. అరకులో కాఫీ మొక్కల పెంపకం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన గుర్తుగా విశాఖలో 2కాంస్య విగ్రహాలు, GVMC, పెద్దేరు రిజర్వాయర్‌‌కు ఆయన పేరు పెట్టారు. విశాఖలో తెన్నేటి పార్క్ అంటే తెలియనివారుండరు.
NOTE: నేడు ఆయన వర్థంతి

News November 10, 2024

విశాఖలో తొలి స్కై స్క్రాపర్ నిర్మాణం..!

image

విశాఖలో తొలి స్కై స్క్రాపర్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. బీచ్ రోడ్డులో ఐకానిక్ తాజ్ గేజ్ వే హోటల్ స్థానంలో వరుణ్ గ్రూప్ దీన్ని నిర్మించనుంది. రూ.600 కోట్లతో 24 ఫ్లోర్లలో ఆఫీస్ స్పేస్, హోటల్, స్టూడియో నిర్మిస్తారు. రూ.120 కోట్లతో తాజ్ గేట్ వే హోటల్‌ను 2018లో ఓరియెంటల్ హోటల్స్ లిమిటెడ్ నుంచి వరుణ్ గ్రూప్ సొంతం చేసుకుంది. ఈనెల 14 నుంచి గేట్ వే హోటల్ కూల్చివేత పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం.

News November 10, 2024

దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజాస్పందన: హోమంత్రి అనిత

image

దీపం-2 పథకానికి అద్భుతమైన ప్రజా స్పందన వస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ‘ఎక్స్’లో పేర్కొన్నారు. సూపర్-6 హామీల్లో ఒకటిగా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 7వ తేదీ సాయంత్రానికి 5,17,383 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.41.17 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం జమ చేసినట్లు వివరించారు.