News June 28, 2024

విశాఖ: వివాహిత మృతి కేసులో ముగ్గురు అరెస్టు

image

వరకట్న వేధింపులతో వివాహిత మృతికి కారకులైన ముగ్గురిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లికి చెందిన ఎం. పద్మిని (32) కి గాజువాకకు చెందిన సోమేశ్‌తో వివాహం అయ్యింది. అదనపు కట్నం కోసం భర్త సోమేశ్, అత్త అప్పలనర్స, మరిది శివ కలిసి తమ కుమార్తెను వేధించి పురుగుమందు తాగించి చంపేశారని పద్మిని తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.

Similar News

News October 31, 2025

UPSC పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు: విశాఖ JC

image

నవంబర్ 2న నిర్వహించనున్న UPSC (యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 7 కేంద్రాల్లో జరిగే ఈ పరీక్షలకు 3268 మంది హాజరుకానునట్లు వెల్లడించారు. అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని JC ఆదేశించారు.

News October 31, 2025

విశాఖ: ఆర్టీసీలో డ్రైవర్ పోస్ట్‌ల భర్తీ

image

ఆర్టీసీలో పదోన్నతుల కారణంగా డ్రైవర్ పోస్టులు ఖాళీ ఏర్పడ్డాయని రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు తెలిపారు. ఐటీఐ చేసి 18 నెలల హెవీ డ్రైవింగ్ లైసెన్సు ఉన్న వారిని ఎంపిక చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో అన్‌కాల్ డ్రైవర్‌గా తీసుకోవడం జరుగుతుందని, దగ్గర్లో ఉన్న డిపోల్లో మేనేజర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

News October 31, 2025

విశాఖ: ‘ఫైన్లు ఈ విధంగా చెల్లించాలి’

image

రవాణా శాఖ, పోలీసు డిపార్టుమెంట్ వాహన తనిఖీలలో భాగంగా నమోదైన కేసులల్లో విధించిన ఫైన్లు చెల్లించాలని ఉప రవాణా కమిషనర్ ఆర్.సి.హెచ్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. తనిఖీలలో భాగంగా రాసిన కేసులను (https://echallan.parivahan.gov.in/) సైట్ ద్వారా చెల్లించాలన్నారు. రవాణా, రవాణేతర వాహనాల త్రైమాసం పన్నులు, ఇతర సేవలకై vahan.parivahan.gov.in చెల్లించవచ్చన్నారు.