News June 28, 2024
విశాఖ: వివాహిత మృతి కేసులో ముగ్గురు అరెస్టు
వరకట్న వేధింపులతో వివాహిత మృతికి కారకులైన ముగ్గురిని గాజువాక పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లికి చెందిన ఎం. పద్మిని (32) కి గాజువాకకు చెందిన సోమేశ్‌తో వివాహం అయ్యింది. అదనపు కట్నం కోసం భర్త సోమేశ్, అత్త అప్పలనర్స, మరిది శివ కలిసి తమ కుమార్తెను వేధించి పురుగుమందు తాగించి చంపేశారని పద్మిని తండ్రి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు.
Similar News
News December 10, 2024
విశాఖ ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
విశాఖలోని స్కానింగ్ సెంటర్లో మహిళను సిబ్బంది వేధింపులకు గురిచేసిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. <<14841020>>మహిళపై అసభ్యంగా <<>>ప్రవర్తించిన సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు.
News December 10, 2024
పలు అభివృద్ధి పనులకు వీఎంఆర్డీఏ ఆమోదం
వీఎంఆర్డీఏ పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసింది.➤ రూ.200 కోట్లతో సముద్రతీరం కోతకు గురి కాకుండా చర్యలు ➤ ఋషికొండ, గంభీరం వద్ద వాటర్ స్పోర్ట్స్ ప్రాజెక్ట్ ➤ రుషికొండ వద్ద హ్యాబిటేట్ సెంటర్ ఏర్పాటు ➤ మధురవాడలో ఒలింపిక్ స్టాండర్డ్స్ అనుగుణంగా రూ.3 కోట్లతో క్రీడా మైదానం ఏర్పాటు ➤ రూ.9 కోట్లతో 15 ప్రాంతాల్లో రహదారుల ➤ అనకాపల్లి వద్ద హెల్త్ సిటీ పనులకు ఆమోదం
News December 10, 2024
హోం మంత్రి అనితకు హైకోర్టులో ఊరట
హోంమంత్రి అనితకు హైకోర్టులో ఊరట లభించింది. చెక్‌బౌన్స్ కేసులో విశాఖ కోర్టులో ఉన్న కేసును కొట్టేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనిత, ఫిర్యాదుదారుడు కోర్టుకు హాజరై రాజీ కుదుర్చుకున్నామని చెప్పడంతో కేసును కొట్టేస్తూ తీర్పునిచ్చింది. 2015లో శ్రీనివాసరావు వద్ద రూ.70లక్షలు అప్పుతీసుకున్న ఆమె 2018లో చెక్కు ఇచ్చారు. ఆ చెక్ బౌన్స్ అవ్వగా అప్పట్లో విశాఖ కోర్టులో సూట్ దాఖలు చేశారు.