News June 4, 2024

విశాఖ: వేటకు సన్నద్ధం అవుతున్న మత్స్యకారులు

image

సముద్రంలో చేపల వేటపై నిషేధం గడువు ఈ నెల 15 తో ముగియనుంది.ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో అప్పుఘర్,వాసవానిపాలెం, పెద్ద జాలరి పేటలో మత్స్యకారులు వేటకు సన్నద్ధం అవుతున్నారు. చేపల వేటకు అవసరమైన వలలను సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే అవసరమైన సామగ్రిని సమకూర్చుకుంటున్నారు. వేట నిషేధం కారణంగా రెండు నెలలపాటు మత్స్యకారులు ఇంటికే పరిమితం అయ్యారు.

Similar News

News September 16, 2024

ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: అనకాపల్లి ఎస్పీ

image

ప్రతి సోమవారం అనకాపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక 16వ తారీకు నాడు రద్దు చేసినట్లు జిల్లా ఎస్పీ దీపిక తెలిపారు. మిలాద్ ఉన్ నబి పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో రద్దు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 23వ తేదీన యధావిధిగా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. ఆర్జీదారులు కార్యాలయానికి రావద్దని సూచించారు.

News September 15, 2024

విశాఖ: ఆ రైలు 5 గంటల ఆలస్యం

image

సంత్రాగచ్చి-సికింద్రాబాద్ ప్రత్యేక రైలు(07222) ఈరోజు 5 గంటల ఆలస్యంగా ప్రారంభం కానుంది. సంత్రాగచ్చి నుంచి 12:20 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. ఇవాళ సాయంత్రం 05:20 గంటలకు అక్కడ రైలు కదులుతుంది. ఈ ట్రైన్ దువ్వాడ స్టేషన్‌కు సోమవారం ఉదయం 8:20 గంటలకు చేరుతుంది. లింక్ రైలు ఆలస్యంగా నడుస్తున్నందున ఈ అసౌకర్యం కలిగినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

News September 15, 2024

విశాఖ: మానసిక వైద్యుడిపై కేసు

image

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన మానసిక వైద్యుడు సతీశ్ కుమార్‌పై పీఎం పాలెం పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. సీతమ్మధారకు చెందిన ఓ సివిల్ కాంట్రాక్టర్ చిన్న కుమార్తె ప్రతి చిన్న విషయానికి భయపడుతోంది. దీంతో మిధిలాపురి వుడా కాలనీలోని సతీశ్‌ను సంప్రదించారు. ఈ క్రమంలో బాలికలకు క్లాస్ చెబుతూ అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఇంటికి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పడంతో ఈనెల 12న పోలీసులకు ఫిర్యాదు చేశారు.