News December 6, 2024

విశాఖ: వేటలో మేమే మేటి.. మాకు లేరు ఎవ్వరూ సాటి!

image

ఆహార సంపాదనలో పెద్ద పులులు తమదైన శైలిలో వ్యవహరిస్తూ ఉంటాయి. వేటాడే సమయంలో అణకువను ప్రదర్శిస్తూ ఓపికతో వేచి చూసి ఒక్క ఉదుటున ఇతర జంతువులపై దాడి చేసి చంపి తింటాయి. ఈ క్రమంలో వాటి ఓపికకు, సహనానికి సలాం కొట్టాల్సిందే. విశాఖ జూ పార్కులో చెట్టుపై కట్టిన మాంసాన్ని ఒక్క ఉదుటున లాక్కుని తింటున్న టైగర్ విన్యాసాలు చూపరులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.

Similar News

News October 28, 2025

అవసరమైతే బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలి: కలెక్టర్

image

మొంథా తుఫాన్ నేపథ్యంలో తీవ్ర ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారిని బలవంతంగా అయినా పునరావాస కేంద్రాలకు చేర్చాలని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. సోమవారం సాయంత్రం ఆయన అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. విశాఖలో 58 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ప్రధానంగా కొండవాలు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని అప్రమత్తం చేయాలన్నారు. మేఘాద్రి గడ్డ దిగువ ప్రాంతాల వాసులను అప్రమత్తం చేయాలని కోరారు.

News October 27, 2025

ఏసీబీ వలలో జీవీఎంసీ ఆర్‌ఐ, సచివాలయ సెక్రటరీ

image

విశాఖలో ఇద్దరు అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యండెడ్‌గా చిక్కారు. తగరపువలస దగ్గర సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సెక్రటరీ సోమ నాయుడు, జీవీఎంసీ ఆర్ఐ రాజును సోమవారం సాయంత్రం ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. లంచానికి సంబంధించిన కేసు విషయంలో ఆరా తీస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 27, 2025

రుషికొండ బీచ్‌లో పరిస్థితులు పరిశీలించిన డీఐజీ

image

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రుషికొండ బీచ్‌ ప్రాంతాన్ని విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, అడిషనల్‌ ఎస్పీ మధుసూదన్‌ పరిశీలించారు. బీచ్‌ తీర ప్రాంతంలో గాలులు బలంగా వీయడంతో భద్రతా ఏర్పాట్లు సమీక్షించారు. పర్యాటకులు, మత్స్యకారులను సముద్ర తీరాలకు వెళ్లవద్దని సూచించారు. పోలీసులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.