News February 26, 2026
విశాఖ వేదికగా దక్షిణాది ఎమ్మెల్యేల క్రీడా పోటీలు: స్పీకర్

విశాఖ వేదికగా దక్షిణాది 6 రాష్ట్రాల ఎమ్మెల్యేల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం తెలిపారు. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పాండిచ్చేరి రాష్ట్రాల ఎమ్మెల్యేలను ఆహ్వానించి భారీ క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే విశాఖ బీచ్ వాలీబాల్, కబడ్డీకి అనుకూలమన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2026
ఏలూరులో ఉమ్మడి జిల్లా బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక

ఏలూరు స్థానిక కస్తూరిబా బాలికల పాఠశాలలో గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సబ్ జూనియర్, జూనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించారు. అసోసియేషన్ ప్రతినిధులు గవ్వా శ్రీనివాసరావు, కె.మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు తాడేపల్లిగూడెం, భీమవరం, తణుకు తదితర ప్రాంతాల నుంచి 150 మంది క్రీడాకారులు హాజరయ్యారు.
News April 16, 2026
KNR: కో-ఆప్షన్ సభ్యుల పదవులకు భారీగా దరఖాస్తులు

కరీంనగర్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎంపికకు సంబంధించి ఈనెల 10 నుంచి 16 వరకు దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం 46 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఐదు కోఆప్షన్ సభ్యులకు భారీగా దరఖాస్తులు రావడంతో దరఖాస్తులు రావడంతో క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తుది ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.
News April 16, 2026
వీడు మాయగాడు.. 500 మంది అమ్మాయిల్ని మోసం చేశాడు!

సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లలో ఫేక్ ప్రొఫైల్స్ సృష్టించి అమ్మాయిల్ని మోసం చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగాల్‌కు చెందిన ఆనంద్(35) తాను డాక్టర్, ఫిల్మ్ ప్రొడ్యూసర్, మోడల్, బిజినెస్‌మ్యాన్ అంటూ ఒక్కొక్కరితో ఒక్కోలా పరిచయం చేసుకున్నాడు. వాళ్లు దగ్గరయ్యాక మెడికల్ ఎమర్జెన్సీ పేరిట, ప్రైవేట్ ఫొటోలు లీక్ చేస్తానని బెదిరించి ₹2Cr వసూలు చేశాడు. దాదాపు 500మంది యువతుల్ని మోసగించాడు.


