News August 18, 2024
విశాఖ: వైద్యుల సెలవులు రద్దు
కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనపై వైద్యులు ఆందోళన తీవ్రతరం చేస్తున్నారు. ఈక్రమంలో విశాఖ కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శివానంద వైద్యుల సెలవులు రద్దు చేశారు. మరోవైపు జూనియర్ వైద్యుల సమ్మె ప్రభావంతో కేజీహెచ్ క్యాజువాలిటీ విభాగం రోగులు లేక శనివారం వెలవెలబోయింది. అత్యవసర రోగుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. 25 మంది వైద్యులను ఓపీతో పాటు వార్డుల్లో నియమించి సేవలు అందించారు.
Similar News
News September 10, 2024
విశాఖ: ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12న జాబ్ మేళా
విశాఖలోని కంచరపాలెం ప్రభుత్వ ఓల్డ్ ఐటీఐలో ఈనెల 12వ తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు విజయనగరం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ టీవీ గిరి తెలిపారు. వివిధ ట్రేడుల్లో ఐటీఐ చేసినవారు అర్హులు. అశోక్ లేలాండ్ కంపెనీలో ఖాళీలు భర్తీ చేయడానికి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. సెలక్ట్ అయిన వారికి దుబాయ్‌లో ఉద్యోగావకాశం అని పేర్కొన్నారు. వివరాలకు 9440197068 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
News September 10, 2024
ఈనెల 17 వరకు సింహాచలంలో వార్షిక పవిత్రోత్సవాలు
సింహాచలం ఆలయంలో ఈనెల 13 నుంచి 17 వరకు వార్షిక పవిత్రోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాస మూర్తి తెలిపారు. ఈ ఉత్సవాల్లో భాగంగా విశేష హోమాలు, వేద పారాయణం, తిరువీధి ఉత్సవాలు జరుగుతాయన్నారు. పవిత్ర ఉత్సవాల సందర్భంగా దేవాలయంలో ఈనెల 13 నుంచి ఆర్జిత సేవలతో పాటు నిత్య కళ్యాణ ఉత్సవాలు కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు. రాత్రి 7 గంటల తర్వాత స్వామి దర్శనాలు లభించవన్నారు.
News September 10, 2024
స్టీల్ ప్లాంట్ కార్మికులు రాస్తారోకో.. పరిస్థితి ఉధృతం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డుకుంటున్న పోలీసులతో కార్మికులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు.