News April 7, 2025

విశాఖ: వైసీపీకి చొక్కాకుల రాజీనామా

image

విశాఖలో YCPకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న చొక్కాకుల వెంకటరావు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. గతంలో ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, పెట్రో కెమికల్ అర్బన్ డెవలప్మెంట్ ఛైర్మన్‌గా పనిచేశారు. 2014లో ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. భార్య కూడా వైసీపీలో పదవులు పొందారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు జగన్‌కు పంపిన లేఖలో పేర్కొన్నారు.

Similar News

News December 4, 2025

6న విశాఖ రానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్

image

ఈ నెల 6,7వ తేదీలలో గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. ఆరోజున ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొని అక్కడ నుండి నోవాటెల్ కు చేరుకుంటారు. మధ్యామ్నం 12.45 గంటలకు మధురవాడలోని ACA-VDCA క్రికెట్ స్టేడియంకు వెళ్లి మ్యాచ్ వీక్షిస్తారు. రాత్రి 10గంటలకు స్టేడియం నుంచి నోవాటెల్ హోటల్‌కు చేరుకుని రాత్రి బస చేస్తారు. 7వ తేదీ మధ్యాహ్నం 1.45కు ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని విజయవాడ తిరిగి వెళ్తారు

News December 4, 2025

విశాఖ చేరుకున్న మంత్రి లోకేశ్

image

విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి లోకేశ్‌కు ఉత్తరాంధ్ర టీడీపీ, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ప్రజలు, కార్యకర్తలను కలిసిన వారి వద్ద నుంచి లోకేశ్ అర్జీలు స్వీకరించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. విశాఖ నుంచి రోడ్డుమార్గంలో పార్వతీపురం జిల్లా భామిని గ్రామానికి చేరుకుంటారు. అనంతరం టీడీపీ నాయకులుతో సమవేశం నిర్వహిస్తారు. రాత్రికి ఆదర్శ పాఠశాలలో బస చేస్తారు.

News December 4, 2025

ఈఎస్ఐ గేటు వద్ద మృతదేహంతో ఆందోళన

image

ఈఎస్ఐ గేటు వద్ద కూర్మన్నపాలేనికి చెందిన మహిళ మృతి చెందడంతో బంధువులు, కుటుంబీకులు ఆందోళన చేపట్టారు. ఈఎస్ఐ డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే పార్వతి చనిపోయిందని బంధువులు ఆరోపిస్తున్నారు. గైనిక్ ప్రాబ్లం కావడంతో పార్వతి ఆసుపత్రిలో జాయిన్ కాగా పరిస్థితి విషమించటంతో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందింది. దీంతో బంధువులు మృతదేహాన్ని గేటు వద్దకు తెచ్చి ఆందోళన చేపట్టారు