News June 22, 2024
విశాఖ: వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు
విశాఖ నగరం ఎండాడ వద్ద గల వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ జోన్-2 అధికారులు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా స్థల సేకరణ చేశారని ఆ నోటీసులో పేర్కొన్నారు. అనుమతులు లేకుండా అడ్డగోలుగా భవన నిర్మాణం చేశారని అధికారులు తెలిపారు. వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ అధికారులు నోటీసులు జారీ చేయడం నగరంలో చర్చనీయాంశంగా మారింది.
Similar News
News November 13, 2024
‘విశాఖకు మెట్రో అవసరం ఉంది’
విశాఖ మెట్రోపై ఉమ్మడి జిల్లా MLAలు అసెంబ్లీలో మాట్లాడారు. విశాఖలో జనాభా పెరగడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని మెట్రో పూర్తయితేనే ఈ కష్టాలు తీరుతాయని గాజువాక MLA పల్లా పేర్కొన్నారు. అనకాపల్లి వరకు మెట్రో ప్లాన్ పొడిగించాల్సని అవసరం ఉందని MLA కొణతాల కోరారు. భోగాపురం ఎయిర్‌పోర్ట్ పూర్తవుతున్న క్రమంలో ట్రాఫిక్ సమస్యలు పెరిగే అవకాశం ఉందని, వీలైనంత త్వరగా మెట్రో పూర్తిచేయాలని MLA గణబాబు అన్నారు.
News November 13, 2024
విశాఖలో డ్రగ్స్ కంటైనర్స్‌పై మరోసారి చర్చ
విశాఖలో డ్రగ్స్ కంటైనర్‌ను CBI సీజ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై MLC బొత్స కేంద్ర హోంమంత్రికి మంగళవారం లేఖ రాశారు. ‘సంధ్యా ఆక్వా సంస్థ పేరు మీద బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ కంటైనర్‌ను CBI సీజ్ చేసింది. ఆక్వా యాజమాన్యానికి పురందీశ్వరికి సంబంధాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. దర్యాప్తు వివరాలు బహిర్గతం కాలేదు. వాస్తవాలను పబ్లిక్ డొమైన్‌లో వెల్లడించాలని CBIకి ఆదేశాలు జారీ చేయండి’ అని పేర్కొన్నారు.
News November 13, 2024
విశాఖలో బంగారు రంగు పాము
నగరంలో యారాడ లైట్ హౌస్ ఇండియన్ నేవీ నివాసితులు ఉండే ప్రదేశంలో మంగళవారం సాయంత్రం పాము ప్రత్యక్షం అయ్యింది. విధులు నిర్వహించి ఇంటికి వచ్చిన నేవీ అధికారి గ్యారేజీలో కారును పార్కింగ్ చేసేందుకు వెళ్లి చూడగా అక్కడ పాము మెరుస్తూ కనిపించిందని తెలిపారు. వెంటనే స్నేక్ క్యాచర్ నాగరాజుకి సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ నాగరాజు ఘటనా స్థలానికి చేరుకొని చాకచక్యంగా పామును పట్టుకున్నారు.