News August 6, 2024
విశాఖ వైసీపీ నాయకులతో సుబ్బారెడ్డి భేటీ

విశాఖ వైసీపీ నాయకులతో ఉత్తరాంధ్ర పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి మంగళవారం భేటీ అయ్యారు. విశాఖలో జరిగిన భేటీలో సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. 10 స్థాయి సంఘాలను వైసీపీ కైవసం చేసుకునే విధంగా పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో నగర మేయర్ హరి వెంకట కుమారి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్ కుమార్, తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 4, 2025
GVMC స్థాయి సంఘంలో ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు..

GVMC స్థాయి సంఘం సమావేశం శనివారం జరగనుంది. మొత్తం 257 అంశాలతో అజెండా కాపీలను సిద్ధం చేసి సభ్యులకు అందజేశారు. ఇన్ని అంశాలను ఒకే సారి పెట్టడం ద్వారా ఎలాంటి చర్చ లేకుండా అమోదించే అవకాశం ఉంది. దీంతో ఆయా అంశాలను స్థాయి సంఘం సభ్యులు పూర్తిగా చదివే అవకాశం కూడా లేకుండా పోతుంది. ప్రజాధనాన్ని అవసరం ఉన్నా.. లేకపోయినా ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.
News December 4, 2025
విశాఖలో నేవీ అమరవీరులకు నివాళి

విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద తూర్పునౌకదళ అధికారులు, కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అమరులైన నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పునౌకదళం కీలకంగా పనిచేస్తుందని వారు కొనియాడారు. నేవీ డే సందర్భంగా గురువారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించారు. కాగా ఈ ఏడాది విశాఖలో నేవీ డే విన్యాసాలను నిర్వహించకపోవడంతో నగరవాసులు నిరుత్సాహానికి గురయ్యారు.
News December 4, 2025
జీవీఎంసీలో విలీనం కానున్న గ్రామీణ మండలాలివే..!

ఉమ్మడి విశాఖ జిల్లా విభజన అనంతరం మిగిలిపోయిన 4 మండలాలైన ఆనందపురం, పద్మనాభం, భీమిలి, పెందుర్తిని GVMCలో విలీనం చేసే ప్రక్రియ జరుగుతోంది. భీమిలి నియోజకవర్గ పరిధిలోని 3 గ్రామీణ మండలాలు (భీమిలి, పద్మనాభం, ఆనందపురం) GVMCలో కలిపేందుకు CM చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, నారాయణ సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. దీంతో GVMC పరిధి విస్తరణతో పాటు వార్డులు కూడా పెరగనున్నాయి.


