News March 12, 2025

విశాఖ: వ్యక్తి మరణానికి కారణమైన నిందితుడికి జీవిత ఖైదు

image

కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 2021 ఆగస్టులో కొండవీటి శివ అనే వ్యక్తి మరొక వ్యక్తిని కర్రతో కొట్టి గాయపరిచాడు. ఆ ఘటనలో గాయపడిన వ్యక్తి వైద్యం తీసుకుంటూ కొద్ది రోజులకు మరణించాడు. ఈ కేసుపై మంగళవారం జిల్లా సెకండ్ ఏడీజే కోర్టులో వాదనలు ముగిశాయి. నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ జడ్జి గాయత్రి దేవి తీర్పునిచ్చారు. బాధిత కుటుంబానికి రూ.3లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

Similar News

News March 20, 2025

విశాఖలో పార్టీ మారిన వైసీపీ కార్పొరేటర్లు

image

జీవీఎంసీలో ఆరుగురు వైసీపీ కార్పొరేటర్లు నారా లోకేశ్, పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ, జనసేనలో గురువారం చేరారు. పార్టీ మారిన వారిలో 13వ వార్డు కార్పొరేటర్ కెల్ల సునీత, 17వ వార్డు కార్పొరేటర్ గేదెల లావణ్య, 73వ వార్డు కార్పొరేటర్ భూపతిరాజు సుజాత, 54వ వార్డు కార్పొరేటర్ చల్లా రజిని, 57వ వార్డు కార్పొరేటర్ ముర్రు వాణి, 36వ వార్డు కార్పొరేటర్ మాసిపోగు మేరీ జోన్స్ ఉన్నారు.

News March 20, 2025

109 కేసుల్లో 73 ఛేదించాం: విశాఖ సీపీ

image

విశాఖ సిటీలో ఫిబ్రవరి నెలలో నమోదైన 109 చోరీ కేసుల్లో 73 ఛేదించామని సీపీ శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. రూ.33.21లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. రూ.60లక్షల విలువైన 419 ఫోన్లను రికవరీ చేశామన్నారు. 660.655 గ్రాముల బంగారం, 2.08 గ్రా. వెండి, రూ.2,73,575 నగదు,14 బైకులు, 2ల్యాప్‌టాప్‌లు, 2గేదెలు, 3లారీ బ్యాటరీలు, 57 సెంట్రింగ్ షీట్లను బాధితులకు అందజేశారు. మిగతా కేసులు ఛేదిస్తున్నామన్నారు.

News March 20, 2025

నితిన్ గడ్కరీతో విశాఖ ఎంపీ శ్రీభరత్ భేటీ

image

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని విశాఖ ఎంపీ శ్రీభరత్ గురువారం ఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విశాఖలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారం చేయాలని.. భోగాపురం విమానాశ్రయానికి మెరుగైన రహదారి నిర్మించాలని కోరారు. విశాఖ-ఖరగ్‌పూర్ కారిడార్‌పై చర్చించారు. ఈ రోడ్లు నిర్మాణం అయితే ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా ఉంటుందని కోరారు.

error: Content is protected !!