News March 24, 2024

విశాఖ: షిప్‌యార్డులో బెల్జియన్‌ డ్రెడ్జర్‌కు మరమ్మతులు

image

బెల్జియన్‌కు చెందిన డ్రెడ్జర్‌కు అనుకున్న సమయం కంటే రెండు రోజుల ముందే మరమ్మతులు పూర్తిచేసి విశాఖలోని షిప్‌యార్డు మరో రికార్డును సొంతం చేసుకుంది. ఈ డ్రెడ్జర్‌ 150 మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పు, 21,002 టన్నుల డెడ్‌ వెయిట్‌తో పాటు 15,000 క్యూబిక్‌ మీటర్ల వాల్యూమ్‌, ఒక ఫుల్డ్‌ డీపీ2 ట్రైలింగ్‌ సెక్షన్‌ అప్పర్‌ కలిగి ఉంది. షిప్‌యార్డులో ఇటువంటి డ్రెడ్జర్‌కు మరమ్మతులు చేయడం ఇదే తొలిసారి.

Similar News

News September 18, 2024

భీమిలి: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి

image

భీమిలి మండలం నారాయణరాజుపేట గ్రామంలో విషాదం నెలకొంది. రౌడి గ్రామంలోని నర్సరీ చదువుతున్న బి.వేణు తేజ(5) బస్సు దిగి వెనుక వైపు నిల్చున్నాడు. గమనించని డ్రైవర్ రివర్స్ చేయగా.. ఆ బాలుడు బస్సు వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. బస్సు ఆ చిన్నారి తలపై నుంచి వెళ్లిపోయింది. బస్సు‌కు క్లీనర్ లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News September 18, 2024

విశాఖ: ‘పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు ఎన్.పి.ఎస్ వాత్సల్య’

image

పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్.పి.ఎస్ వాత్సల్య యోజన పథకం ఎంతో దోహదపడుతుందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం ప్రారంభించారు. సిరిపురం వద్ద ఎస్బీఐ పరిపాలన విభాగంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ పథకం దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తుందన్నారు.

News September 18, 2024

విశాఖ: పర్యాటక అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

image

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న‌ అవార్డులు అందజేసేందుకు వీలుగా 2023- 24 సంవత్సరానికి అర్హులైన పర్యాటక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. www.aptourism.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏపీ టూరిజం అథారిటీ, 5వ ఫ్లోర్, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ చిరునామాకు అందచేయాలన్నారు.