News December 29, 2024

విశాఖ: ‘సంక్రాంతికి 800 బస్సు సర్వీసులు’

image

సంక్రాంతి సీజన్‌లో ఉత్తరాంధ్రకు 800 ట్రిప్పులు ఆర్టీసీ బస్సులు నడిపేందుకు ప్రణాళికను రూపొందించినట్లు విశాఖ జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు. శనివారం ఆయన విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మాట్లాడుతూ హైదరాబాద్ విజయవాడ భీమవరం తదితర ప్రాంతాలకు కూడా ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్నారు.

Similar News

News January 6, 2025

జామ చెట్టుకు గుమ్మడికాయలు..!

image

జామ చెట్టులో గుమ్మడికాయలు కాయడం ఏంటని వింతగా చూస్తున్నారా? అవునండీ పైన కనిపిస్తున్న చిత్రం ఆదివాసీల జీవన ప్రమాణాలపై వారి ముందు చూపు, ఆలోచన విధానాన్ని తెలియజేస్తోంది. పెదబయలు మండలం గోమంగి పంచాయతీ బోయరాజులలో ఓ గిరిజన రైతు పండించిన గుమ్మడి కాయలు పాడవకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి పెరటిలో ఉన్న జామ చెట్టుకి గుమ్మడి కాయలను వేలాడ దీశాడు. దీంతో అవి చెడిపోకుండా ఉంటుందట.

News January 6, 2025

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో పొగలు..! 

image

వైజాగ్ నుంచి సికింద్రాబాద్‌కు ఆదివారం బయలుదేరిన గోదావరి ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో పొగతో పాటు కాలిన వాసన రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి 1గంట సమయంలో ఖమ్మం సమీపంలోకి ట్రైన్ చేరుకునే సరికి B1 కోచ్‌లో ఫైర్ అలారం మోగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైలును సుమారు 45min నిలిపి సమస్య పరిష్కరించడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. 

News January 6, 2025

విశాఖ: ‘8న జరగాల్సిన పరీక్ష 11కు వాయిదా’

image

కానిస్టేబుల్ పోస్టుల భర్తీలో భాగంగా కైలాసగిరి రిజర్వు పోలీస్ మైదానంలో జరుగుతున్న దేహదారుఢ్య పరీక్షల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. ఈ నెల 8న జరగాల్సిన దేహదారుఢ్య పరీక్షలను 11వ తేదీకి వాయిదా వేసినట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఛైర్మన్ ఎం.రవి ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు పీఈటీ పరీక్షలు జరిగే శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అభ్యర్థులు గమనించాలని కోరారు.