News September 5, 2024
విశాఖ: సాంకేతిక లోపంతో వెనక్కి వచ్చిన విమానం
విశాఖ నుంచి బయలుదేరిన విమానం సాంకేతిక లోపం కారణంగా కాసేపటికే తిరిగి వెనక్కి వచ్చింది. బుధవారం విశాఖ నుంచి హైదరాబాద్‌కు విమానం బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్లు అప్రమత్తమై విమానాన్ని వెనక్కి తీసుకువచ్చినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. సాంకేతిక లోపం సవరించిన తర్వాత విమానం బయలుదేరింది.
Similar News
News September 18, 2024
ఏపీలో మొదటి స్థానంలో విశాఖ రైల్వే స్టేషన్
ఆదాయ ఆర్జనలో విశాఖ రైల్వే స్టేషన్ ఏపీలో మొదటి స్థానంలో నిలిచింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల రాకపోకల ద్వారా రూ.564 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. ఏపీలో టాప్ 30 రైల్వేస్టేషన్లలో కూడా విశాఖ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. తిరుపతి విజయవాడ స్టేషన్‌లతో పోలిస్తే ప్రయాణికుల రాకపోకల విషయంలో వెనుకంజలో ఉంది.
News September 17, 2024
విశాఖలో ఆన్‌లైన్ వ్యభిచారం.. ఐదుగురు అరెస్ట్
విశాఖలోని ఆన్‌లైన్‌లో జరుగుతున్న వ్యభిచార గుట్టును సైబర్ క్రైమ్ టూ టౌన్ పోలీసులు రట్టు చేశారు. నగర కమిషనర్ ఆదేశాలతో నిఘా పెట్టిన పోలీసులు.. ఏజెంట్ల సాయంతో వ్యభిచారం నిర్వహిస్తున్న రావాడ కామరాజుతో పాటు రమేశ్, సుభద్ర, సూర్యవంశీ, రాములను అరెస్టు చేశారు. 34 మంది ఏజెంట్ల డేటాను భద్రపరిచి అనాధికార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని పోలీసులు వెల్లడించారు.
News September 17, 2024
ఈ నెల 19న విశాఖకు గవర్నర్ రాక
ఈనెల 19వ తేదీన రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ విశాఖ రానున్నారు. హైదరాబాద్ నుంచి విమానంలో మధ్యాహ్నం 3.50 గంటలకు ఆయన విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నోవాటెల్‌కు వెళతారు. సాయంత్రం ఏయూలో నిర్వహించే దివ్య కల మేళాలో ఆయన పాల్గొంటారు. తిరిగి నొవాటెల్ కు చేరుకొని రాత్రి అక్కడ బస చేస్తారు. 20వ తేదీ సాయంత్రం విమానంలో ఆయన విజయవాడ వెళతారు.