News September 2, 2024
విశాఖ-సికింద్రాబాద్ మధ్య ప్రత్యేక రైలు

రాబోయే పండగల సీజన్ లో విశాఖ-సికింద్రాబాద్-విశాఖ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు వాల్తేర్ రైల్వే డివిజన్ డీసీఎం కే.సందీప్ తెలిపారు. ఈనెల 8 నుంచి డిసెంబర్ 1వ తేదీ వరకు సికింద్రాబాద్-విశాఖ స్పెషల్ ట్రైన్ ప్రతి ఆదివారం సికింద్రాబాద్లో సాయంత్రం బయలుదేరుతుందని మరుసటి రోజు విశాఖ వస్తుందని తెలిపారు. అలాగే విశాఖ నుంచి సికింద్రాబాద్కు ఈ నెల 9 నుంచి డిసెంబర్ రెండో తేదీ వరకు ప్రతి సోమవారం నడుస్తుందన్నారు.
Similar News
News September 18, 2025
ఈ-గవర్నెన్స్ సదస్సుకు అన్ని ఏర్పాట్లు చేయాలి – కలెక్టర్

విశాఖలో సెప్టెంబర్ 22, 23న జరిగే 28వ జాతీయ ఈ-గవర్నెన్స్ సదస్సుకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టరేట్లో ఆయన మాట్లాడారు. నోవాటెల్ హోటల్లో జరిగే ఈ సదస్సులో ఐటీ నిపుణులు, కేంద్ర-రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారని తెలిపారు. 13 ప్రధాన, 10 ఉప కమిటీల సమన్వయంతో నగర సుందరీకరణ, భద్రత, శానిటేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచించారు.
News September 18, 2025
ఆనందపురం: కుక్క అడ్డురావడంతో ఆటో బోల్తా.. వ్యక్తి మృతి

ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జగన్నాధపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఎర్ర గౌరి నాయుడు(40) గురువారం మధ్యాహ్నం కుసులవాడ తీగలవానిపాలెం చెరువు దగ్గర కుక్క అడ్డం రావడంతో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. తలకు తీవ్ర గాయాలవల్ల అక్కడికక్కడే మృతి చెందాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 18, 2025
విశాఖలో ఏడు చోట్ల చైన్ స్నాచింగ్

విశాఖలో బుధవారం రాత్రి చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. వన్ టౌన్, కంచరపాలెం, షీలా నగర్ ప్రాంతాల్లో ఒకే బ్యాచ్ ఏడు చైన్ స్నాచింగ్లు చేసి కలకలం సృష్టించింది. ఒకే బైక్ పై ఇద్దరు యువకులు ఈ ఏడు చోట్ల చోరీలు చేసినట్లు సమాచారం. దొంగతనం చేసిన బైక్తో స్నాచింగ్కు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించారు. 7 చోట్ల జరిగిన స్నాచింగ్లో సుమారు 20 తులాల వరకు బంగారు ఉంటుందని చెబుతున్నారు.