News April 24, 2024
విశాఖ: సీఎం జగన్ యాత్ర.. రూట్ మ్యాప్ ఇదే
సీఎం జగన్ ఈరోజు ఉ.9 గంటలకు ఎంవీవీ సిటీ నుంచి బయలుదేరతారు. మధురవాడ మీదుగా ఆనందపురం చేరుకుని కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తారు. అనంతరం తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుని అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత బొద్దవలస మీదుగా సాయంత్రం 3.30 గంటలకు చెల్లూరు చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలసలో రాత్రి బస శిబిరానికి చేరుకుంటారని వైసీపీ నాయకులు తెలిపారు.
Similar News
News January 16, 2025
విశాఖ: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి
జవహర్ నవోదయ విద్యాలయలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఈ నెల 18న నిర్వహించబోయే ఎంపిక పరీక్ష కోసం విశాఖ కలెక్టరేట్‌లో సమీక్షా నిర్వహించారు. కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పరీక్ష కేంద్రాలు, పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామ రాజు జిల్లాలలోని 39 కేంద్రాలలో ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పరీక్షకు 9080 మంది హాజరు కానున్నారు.
News January 16, 2025
నక్కపల్లి: బాలుడిని కాపాడబోయి మృత్యువాత పడిన యువకుడు
ఎస్.రాయవరం మండలం రేవు పోలవరం సముద్ర తీరంలో <<15167020>>బాలుడిని<<>> కాపాడబోయిన యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈనెల 15వ తేదీన సముద్రతీరంలో బాలుడు మునిగిపోతుండగా కాపాడడానికి వెళ్లిన మణికంఠ అనే యువకుడు గల్లంతైన విషయం తెలిసిందే. గల్లంతైన యువకుడు గురువారం నక్కపల్లి మండలం చినతీనార్ల సముద్రతీరానికి కొట్టుకు వచ్చాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News January 16, 2025
విశాఖ: స్వగ్రామాల నుంచి పట్టణాలకు బయలుదేరిన ప్రజలు
ఉమ్మడి విశాఖ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముగిశాయి. చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వెళ్లిన జిల్లా వాసులు పండగ కోసం తరలి వచ్చారు. మూడు రోజులు ఎంతో ఎంజాయ్ చేశారు. నిన్న రాత్రి నుంచే పలువురు తిరిగి తమ ఉద్యోగాలకు బయల్దేరారు. దీంతో జిల్లాలోని రైల్వే స్టేషన్‌లు, బస్ స్టేషన్‌లలో గంటల తరబడి వేచి ఉంటున్నారు. మరికొందరు సొంత వాహనాలతో తిరుగుపయనం అవుతున్నారు.