News March 23, 2024

విశాఖ: ‘సీఎం, మంత్రుల ఫోటోలు ఉండకూడదు’

image

ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఖచ్చితంగా అమలుచేయాలని జిల్లా ఎన్నికల అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆర్.ఓలను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి జారీ చేయబడే విద్యుత్, తాగునీరు, ఇతర బిల్లులపై ముఖ్యమంత్రులు, మంత్రులు, ఇతర రాజకీయ ప్రతినిధుల ఫొటోలు గాని, వారి సందేశాలు గాని ఉండకూడదని స్పష్టం చేశారు.

Similar News

News November 16, 2025

ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా జీతం చెల్లింపుపై RINL సర్క్యులర్

image

విశాఖ స్టీల్ ప్లాంట్, RINL సర్క్యులర్ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం, ఉద్యోగుల జీతం ఇకపై సాధించిన ఉత్పత్తి లక్ష్యాల శాతానికి అనుగుణంగా చెల్లించబడుతుంది. గతంలో లక్ష్యాలు చేరుకోకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. 8 గంటల పాటు విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగులకు, సంస్థ నిబంధనల ప్రకారం పూర్తి జీతం ఇవ్వాలని కార్మిక సంఘాలు తీవ్రంగా డిమాండ్ చేస్తున్నాయి. ఈ నూతన విధానం అమలుపై ప్లాంట్‌లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

News November 16, 2025

విశాఖ: ప్రభుత్వ కార్యాలయాలలో రేపు పీజీఆర్ఎస్

image

విశాఖ కలెక్టరేట్‌లో ఈనెల 17న ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. సోమవారం ఉదయం 11 గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. అదేవిధంగా సీపీ, జీవీఎంసీ ప్రధాన, జోనల్ కార్యాలయాల్లో కూడా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు వినతులు స్వీకరిస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.

News November 16, 2025

కంచరపాలెంలో చెట్టుకు వేలాడుతున్న మృతదేహం

image

కంచరపాలెంలోని ఓ చెట్టుకు వేలాడుతున్న వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు శనివారం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో కంచరపాలెం సీఐ రవికుమార్ సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. పదిరోజుల క్రితమే ఈ ఘటన జరిగి ఉండవచ్చని, మృతుని వయస్సు సుమారు 35-40 ఏళ్లు ఉంటుందని సీఐ తెలిపారు. మృతుని వివరాలు తెలియరాలేదని, దీనిని అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చెప్పారు