News April 2, 2025

విశాఖ సీపీకి హోం మంత్రి ఫోన్

image

కొమ్మాది స్వయంకృషినగర్‌లో ప్రేమోన్మాది దాడి ఘటనపై హోం మంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత భాగ్చీతో ఫోన్‌లో మాట్లాడిన ఆమె.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దివ్య ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దివ్యకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ప్రేమోన్మాదిని త్వరగా గాలించి పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. దివ్య తల్లి లక్ష్మి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Similar News

News April 10, 2025

దంతెవాడ వరకే కిరండూల్ ఎక్స్‌ప్రెస్

image

విశాఖ నుంచి బయలుదేరే విశాఖ-కిరండూల్ ప్యాసింజర్ (58501/58502) ఈనెల 14 నుంచి 22 వరకు అరకు-విశాఖ మధ్య నడుస్తుందని వాల్తేర్ DCM సందీప్ తెలిపారు. విశాఖ నుంచి బయలుదేరే కిరండూల్ నైట్ ఎక్స్‌ప్రెస్(18515/18516) ఈనెల 15 నుంచి 22 వరకు దంతెవాడకు తిరిగి 16 నుంచి 23 మధ్యలో విశాఖకు బయలుదేరుతుందన్నారు. డార్లిపుట్-పాడువా స్టేషన్ల పునర్నిర్మాణం, భద్రతా సంబంధిత ఆధునీకరణ పనుల కారణంగా ఈ మార్పు చేసినట్లు తెలిపారు. 

News April 10, 2025

రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాలి: కలెక్టర్

image

రెవెన్యూ స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో అధికారులు, సిబ్బంది వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌ని క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ పేర్కొన్నారు. క‌లెక్ట‌రేట్ మీటింగ్ హాలులో బుధ‌వారం రెవెన్యూ వ‌ర్క్ షాప్ నిర్వహించారు. రెవెన్యూ ప‌ర‌మైన అన్ని అంశాల‌పై, ప్ర‌భుత్వ జీవోల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌న్నారు. ఆక్ర‌మ‌ణ‌ల‌ క్ర‌మ‌బ‌ద్ధీక‌ర‌ణ‌, రిజిస్ట్రేష‌న్‌లో అనుస‌రించాల్సిన విధానాల‌పై దిశానిర్దేశం చేశారు.

News April 9, 2025

విశాఖలో రేపు మాంసం దుకాణాలకు సెలవు

image

మహావీర్ జయంతి సందర్భంగా జీవీఎంసీ పరిధిలో గురువారం మాంసం దుకాణాలకు సెలవు ప్రకటించినట్లు జీవీఎంసీ నగర పశు నియంత్రణాధికారి డాక్టర్ ఎన్.కిషోర్ బుధవారం తెలిపారు. కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌ఛార్జ్ కమిషనర్ హరేంధిర ప్రసాద్ ఆదేశాల మేరకు రేపు జంతువధ, మాంస విక్రయాలు నిషేధం అన్నారు. ఈ నింబదనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

error: Content is protected !!