News August 27, 2024

విశాఖ సీపీ చొరవతో బస్సు సౌకర్యం 

image

విశాఖ పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి చొరవతో 77వ వార్డు నమ్మి దొడ్డి జంక్షన్‌కు బస్ సౌకర్యం కలిగింది. ఇటీవల సీపీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో వారి సమస్యలు తెలుసుకున్నారు. నమ్మిదొడ్డి ప్రాంతానికి బస్సు సౌకర్యం లేదని ప్రజలు సీపీకి తెలియజేయడంతో తక్షణమే స్పందించి ఆర్టీసీ రీజనల్ మేనేజర్‌తో మాట్లాడారు. దీంతో సోమవారం గాజువాక డిపో నుంచి నమ్మి దొడ్డి జంక్షన్ వరకు బస్సును ప్రారంభించారు.

Similar News

News January 21, 2025

పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం

image

పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ కంపెనీలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 21, 2025

స్టీల్ ప్లాంట్: విద్యుత్ షాక్‌తో కార్మికుడి దుర్మరణం

image

స్టీల్ ప్లాంట్‌ రైల్వే లైన్‌లో విద్యుత్ షాక్‌తో కాంట్రాక్టు కార్మికుడు సోమవారం మృతి చెందాడు. ఇస్లాం పేటకు చెందిన మహమ్మద్ గౌస్ (26) స్టీల్ ప్లాంట్‌లో రైల్వేకు చెందిన సురభి ఎంటర్‌ప్రైజెస్‌లో పనిచేస్తున్నాడు. ట్యాంకర్‌పై ఉన్న విద్యుత్ లైన్లు తాకడం వల్ల షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News January 21, 2025

విశాఖ: అలా చేస్తే ఐదేళ్ల జైలు శిక్ష..!

image

విశాఖలో DMHO కార్యాలయంలో ప్రభుత్వ,ప్రైవేటు ఆసుపత్రుల డాక్టర్లకు మహిళల హక్కుల పరిరక్షణ, లింగ వివక్షపై అవగాహన నిర్వహించారు. డిస్ట్రిక్ట్ సీనియర్ సివిల్ జడ్జ్ వెంకట శేషమ్మ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. హాస్పిటల్లో లింగ నిర్ధారణ చేయకూడదని, అలా చేస్తే మొదటిసారి రూ.10వేలు జరిమానా, 3ఏళ్లు జైలు శిక్ష, రెండో సారి లక్ష రూపాయల జరిమానా, 5ఏళ్ల జైలు శిక్ష, నేరం నిరూపణ ఐతే రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామన్నారు.