News March 26, 2025

విశాఖ సీపీ సూచన.. సీఎం చంద్రబాబు ఆదేశాలు..!

image

రాష్ట్రంలో డీ అడిక్షన్ సెంటర్లు పెంచాలని విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీ కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేసిన సమావేశంలో సూచించారు. ఒక్కో డ్రగ్‌కు ఒక్కో విధమైన ట్రీట్‌మెంట్ ఉంటుందన్నారు. సీఎం చంద్రబాబు స్పందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయాలని ఆదేశించారు. ఏ ప్రాంతంలో ఏ డ్రగ్ ఎక్కువగా వాడుతున్నారో తెలుసుకుంటే అక్కడ డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేయొచ్చని అధికారులకు సూచించారు.

Similar News

News November 8, 2025

విశాఖ: నిర్మాణాల వద్ద వాలిపోతున్న చోటా నేతలు

image

సొంత ఇంటి నిర్మాణం మధ్యతరగతి కుటుంబాల కల. విశాఖలో కొందరు చోటా నాయకులు తమ ఆగడాలతో సామాన్యుల కలను చిదిమేస్తున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే GVMCకి ఫీజులు చెల్లించి, టౌన్ ప్లానింగ్ అనుమతి తీసుకుంటే చాలు. కానీ ఈ నాయకులు ప్రజల నుంచి ముడుపులు వసూలు చేస్తుండటంతో.. ఈ వేధింపులు తాళలేక ఇటీవల ఓ ఇంటి యజమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. నగరంలో వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు.

News November 8, 2025

KGHలో పవర్ కట్.. ప్రభుత్వం సీరియస్

image

KGHలో గురువారం 10 గంటలపాటు కరెంట్ నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఛైర్మన్‌గా ఉన్న ఈ ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి ఇంత పెద్ద స్థాయిలో విద్యుత్ అంతరాయం జరగడంపై ఆరోగ్యశాఖ సీరియస్‌ అయింది. కాగా.. కనీసం జనరేటర్లు కూడా సమకూర్చలేరా అంటూ YCP ప్రభుత్వ వైఫల్యాన్ని తీవ్రంగా ఎత్తిచూపింది. ‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం ఆటలాడుతోంది’అంటూ YCP నేతలు విమర్శలు గుప్పించారు.

News November 8, 2025

విశాఖ: ‘పెండింగ్‌లో ఉన్న నూతన వాహనాల రిజిస్ట్రేషన్లు వేగవంతం’

image

దసరా, దీపావళి, GST సంస్కరణల సందర్భంగా ప్రజలు వాహనాలను ఎక్కువగా కొనుగోలు చేశారు. ఎక్కువ సంఖ్యలో వాహనాలు కొనుగోలు జరగడంతో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్లు పెండింగ్‌ వలన రవాణా శాఖ కార్యాలయంలో అదనపు సిబ్బందిని వినియోగించి వాహనాలకు శుక్రవారం పర్మినెంట్ రిజిస్ట్రేషన్ నంబర్ కేటాయించామని DTC R.C.H.శ్రీనివాస్ తెలిపారు. ప్రత్యేక నంబర్లు కొనుగోలు చేసిన వారికీ నంబర్లు కేటాయించిన వెంటనే వాటిని అప్రూవల్ చేస్తామన్నారు.