News May 24, 2024
విశాఖ: సైబర్ నేరగాళ్ల నుంచి 60 మందికి విముక్తి

కంబోడియా సైబర్ నేరగాళ్ల నుంచి ఎట్టకేలకు 60 మందికి విముక్తి లభించింది. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకున్న విశాఖ వాసి ఒకరు ఇచ్చిన సమాచారంతో విశాఖ నగర కమిషనర్ స్పందించారు. విశాఖకు చెందిన 150 మంది, దేశవ్యాప్తంగా 5,000 మంది కంబోడియా మోసగాళ్ల చెరలో ఉన్నట్లు తెలుస్తోంది. విముక్తి లభించిన 60 మంది గురువారం భారత్‌కు బయలుదేరినట్లు విశాఖ పోలీసులకు సమాచారం అందింది. వారి కోసం కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు.
Similar News
News February 14, 2025
విద్యార్థి మృతిపై నివేదిక ఇవ్వండి: బాలల హక్కుల కమిషన్

మధురవాడ లో ఇంటర్ విద్యార్థి మేడపై నుంచి దూకి మృతి చెందిన ఘటనపై పోలీస్, ఇంటర్ విద్యాశాఖ అధికారులు నివేదిక అందించాలని ఏపీ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు గొండు సీతారాం ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఒత్తిడి వల్ల చనిపోయాడా, ఇతర కారణాలు వల్ల చనిపోయామా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాలని సూచించారు.
News February 13, 2025
ఏలూరులో వందే భారత్‌కు అదనపు హాల్ట్ కొనసాగింపు

విశాఖ – సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707/08)కు ఏలూరు రైల్వే స్టేషన్‌లో అదనపు హాల్ట్ మరో ఆరు నెలలు కొనసాగుతుందని వాల్తేరు డివిజన్ డిసిఎం సందీప్ గురువారం తెలిపారు. ఏలూరు రైల్వే స్టేషన్‌లో ఒక నిమిషం పాటు రైలు ఆగనున్నట్లు తెలిపారు. ఈ హాల్ట్ ఇరువైపులా ఉంటుందన్నారు. ప్రయాణికుల విషయాన్ని గమనించాలన్నారు.
News February 13, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLC బరిలో 10 మంది

ఉత్తరాంధ్ర టీచర్ MLC స్థానానికి 10మంది పోటీలో ఉన్నట్లు ఎన్నికల అధికారి హరేంధిర ప్రసాద్ తెలిపారు. 10మంది నామినేషన్ వెయ్యగా.. ఏ ఒక్కరూ ఉపసంహరించుకోలేదన్నారు. ఈనెల 27న పోలింగ్ జరగనుండగా.. మార్చి 3న కౌంటింగ్ ఉండనుంది. 12 ఎంసీసీ బృందాలు, 11 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. నేర చరిత్ర లేనివారిని ఏజెంట్లుగా నియమించుకోవాలని సూచించారు.