News January 1, 2025

విశాఖ: స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో ఖాళీగా ఉన్న 106 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పోస్టులు భర్తీ చేయనున్నారు. బుధవారం నుంచి ఈనెల 15వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు విశాఖ ప్రాంతీయ సంచాలకుల కార్యాలయంలో అప్లికేషన్లు అందజేయవచ్చు. మరిన్ని వివరాలకు htts://nagendrasvst.wordpress.com వెబ్ సైట్‌లో చూడొచ్చు. >Share it

Similar News

News January 7, 2025

ప్రధాని సభా ప్రాంతం పరిశీలించిన ఎంపీ శ్రీ భరత్

image

విశాఖలో ప్రధాని మోదీ పర్యటన పనులను మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి విశాఖ ఎంపీ శ్రీ భరత్ పరిశీలించారు. రోడ్డు, ప్రధాని సభ, గ్యాలరీ, బారికేడ్లు, పనులను పరిశీలించారు. దూర ప్రాంతాల నుంచి ప్రధానిని చూడటానికి వస్తున్న ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లను మరింత బాగా చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 7, 2025

ప్రధానమంత్రి రోడ్ షోకు ప్రచార రథం సిద్ధం..!

image

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం విశాఖలో నిర్వహించిన రోడ్‌ షోకు ప్రచార రథాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. వెంకటాద్రి వంటిల్లు ప్రాంతం నుంచి ఏయూ మైదానం వరకు ప్రధాని ఈ రథంపై రోడ్‌ షో నిర్వహించనున్నారు. ప్రధానంగా మోదీ బొమ్మ మధ్యన ఉంటూ ఇరువైపులా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోలను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది

News January 7, 2025

పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు: హోం మంత్రి అనిత

image

పాయకరావుపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ ప్లాంట్ వల్ల పర్యావరణానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవని హోం మంత్రి అనిత స్పష్టం చేశారు. మంగళవారం ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ఏయూలో ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉందన్నారు. ప్రధాని పర్యటన కోసం ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోందని పేర్కొన్నారు.