News March 21, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కి షాక్

image

విశాఖ ఉక్కును విద్యుత్ బిల్లుల గండం మరింత భయపెడుతోంది. బాయిలర్ బొగ్గు కొరతతో ప్లాంట్‌లోని 315 మెగావాట్ల సొంత థర్మల్ విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా పడిపోయింది. ఈపీడీసీఎల్ నుంచి విద్యుత్‌ని ఉపయోగించుకుంటున్నారు. ప్రస్తుతం చెల్లించాల్సిన బకాయిలు రూ.60 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. ఇవి చెల్లించకపోతే సరఫరా నిలిపివేస్తామంటూ ఈపీడీసీఎల్ హెచ్చరిస్తూ నోటీసులిచ్చినట్లు తెలుస్తోంది.

Similar News

News January 1, 2025

జియ్యమ్మవలస: RPF కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

image

పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ అనంత నాయుడు అనుమానాస్పద రీతిలో మంగళవారం మృతి చెందారు. నల్గొండలో అక్కడి రైలు పట్టాలపై మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నాయుడు మృతితో స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News January 1, 2025

మరికొద్ది రోజుల్లోనే నదుల అనుసందానం: మంత్రి

image

సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వలన నూతన సంవత్సరానికి ముందుగానే పండగ వాతావరణం ఏర్పడిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర ప్రజలకు మంగళవారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నదుల అనుసంధానం అనేది ఎన్డీఏ ప్రభుత్వ విధానమని, మరి కొద్ది రోజుల్లోనే ఏపీలో నదుల అనుసంధానం కార్యక్రమం పట్టాలు ఎక్కబోతుందని మంత్రి తెలిపారు.

News December 31, 2024

VZM: రెండో రోజు 280 మంది అభ్యర్థులు గైర్హాజరు

image

విజయనగరం పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ రెండో రోజు కొనసాగింది. మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 320 మంది అభ్యర్థులు మాత్రమే PMT, PET పరీక్షలకు హాజరయ్యారు. రెండో రోజు 280 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. కాగా ఎంపిక ప్రక్రియ మంగళవారం ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరుకు జరిగింది.