News August 1, 2024

‘విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 3ఏళ్ల ట్యాక్స్ హాలిడే ప్రకటించాలి’

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు మూడేళ్ల పాటు ట్యాక్స్ హాలిడే ప్రకటించాలని స్టీల్ సీఐటీయూ గౌరవ అధ్యక్షులు అయోధ్యరామ్ డిమాండ్ చేశారు. కార్మికులు చేపట్టిన దీక్షలు బుధవారం నాటికి 1266వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడుతూ.. లెటర్ ఆఫ్ కంఫర్ట్ ఇవ్వాలన్నారు. ఐరన్ ఓర్ సరఫరా చేయాలన్నారు. రైల్వే వేగన్స్ కేటాయించాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్మాణంలో విశాఖ స్టీల్‌ను వినియోగించాలన్నారు.

Similar News

News October 26, 2025

విశాఖలో పాఠశాలలు, కళాశాలలకు 2 రోజుల సెలవు

image

మొంథా తుఫాను హెచ్చరికల నేపథ్యంలో విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలకు, అంగన్వాడీలకు 2 రోజులపాటు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు విడుదల చేశారు. 27, 28వ తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో అన్ని పాఠశాలు, కాలేజీలకు సెలవు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

News October 26, 2025

విశాఖ కలెక్టరేట్‌లో రేపటి ‘పీజీఆర్ఎస్’ రద్దు: కలెక్టర్

image

‘మొంథా’ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో, విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం (అక్టోబర్ 27) జరగాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. తుఫాను ముందస్తు చర్యల కోసం అధికారులు అందుబాటులో ఉండాల్సి ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. వచ్చే వారం PGRS యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

News October 26, 2025

విశాఖ: నడిసంద్రంలో బిక్కుబిక్కుంటూ

image

విశాఖలోని జాలరిపేటకు చెందిన ఎల్లాజీ శుక్రవారం ఉదయం చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. శనివారం 8 బోట్ల సహాయంతో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. వేట సమయంలో తిరగబడిపోయిన తెప్పపై 40 గంటల పాటు నిలబడి ప్రాణాలు కాపాడుకున్నాడు. బిక్కుబిక్కుమంటూ ఉన్న ఎల్లాజీని కాకినాడ జిల్లా కంతంపేట మత్స్యకారులు గమనించి కాపాడారు. స్థానిక జేడి ఆఫీసుకి సమాచారం అందజేయండంతో విశాఖ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.