News July 11, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుందాం: సీఎం చంద్రబాబు

విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంతోమంది అమరవీరుల త్యాగ ఫలితంగా ఏర్పడిందని సీఎం చంద్రబాబు అన్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవడానికి తాను ప్రయత్నిస్తుంటే, అబద్ధాల పార్టీ(వైసీపీని ఉద్దేశించి)నాయకులు లేనిపోని బురద జల్లుతున్నారని మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా పర్యటనలో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు అనుకూలంగా ఎన్డీఏ కూటమి ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందనవసరం లేదన్నారు.
Similar News
News February 9, 2025
విశాఖ: సముద్రంలో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి

విశాఖకు చెందిన ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లి సముద్ర తీరంలో ఆదివారం మృతిచెందారు. మృతులు కంచరపాలేనికి చెందిన మొక్క సూర్యతేజ, దువ్వాడకు చెందిన మొక్క పవన్‌గా గుర్తించారు. రాంబిల్లి బీచ్‌లో స్నానం చేయడానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అలల తాకిడికి సముద్రంలో మునిగి చనిపోయినట్లు పోలీసు అధికారులు ధ్రువీకరించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 9, 2025
విశాఖ: మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు బ్రేక్

విశాఖ జిల్లాలో గీత కులాలకు కేటాయించిన 14 మద్యం షాపులు లాటరీ పద్ధతికి బ్రేక్ పడింది. సోమవారం లాటరీ పద్ధతిలో షాపులు కేటాయించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ ప్రక్రియకు ఆటంకం ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత తేదీని ఖరారు చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.
News February 9, 2025
పోక్సో కేసులో విశాఖ సెంట్రల్ జైలుకు టీచర్: ఎస్ఐ

ఇటీవల వడ్డాదిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ గంగా ప్రసాద్‌పై <<15378554>>పోక్సో కేసు <<>>నమోదు చేసినట్లు బుచ్చయ్యపేట ఎస్ఐ ఏ.శ్రీనివాసరావు తెలిపారు. చోడవరం కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించారన్నారు. నిందితుడిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ ఘటనపై హోం మంత్రి అనిత, ప్రజాసంఘాలు స్పందించిన విషయం తెలిసిందే.