News July 20, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై రామ్మోహన్‌ నాయుడు కీలక ప్రకటన

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ జరగదని స్పష్టం చేశారు. విశాఖ రైల్వే జోన్‌కు భూమి విషయంలో ఉన్న సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. ఏపీ ఆర్థిక వ్యవస్థ సరిగా లేదనే విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ఏపీకి న్యాయం జరిగేలా ఉంటుందని చెప్పారు.

Similar News

News December 9, 2025

విశాఖ: రేపటి నుంచి 21 వ‌ర‌కు టెట్ ప‌రీక్ష‌

image

డిసెంబ‌ర్ 10 నుంచి 21వ తేదీ వ‌ర‌కు జిల్లాలోని 12 కేంద్రాల్లో టెట్ పరీక్షలు నిర్వ‌హించ‌నున్నట్లు డీఈఓ ప్రేమ్ కుమార్ మంగళవారం తెలిపారు. విశాఖ‌ జిల్లాలో 11 కేంద్రాలు, అన‌కాప‌ల్లి, మాక‌వ‌ర‌పాలెంలో ఒక కేంద్రం ఉంద‌ని పేర్కొన్నారు. మొత్తం 26,248 మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష‌కు హాజ‌ర‌వుతున్న‌ట్లు వివ‌రించారు. ఉద‌యం 9.30 నుంచి 12 వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వ‌ర‌కు ప‌రీక్ష ఉంటుంద‌న్నారు.

News December 9, 2025

విశాఖలో ఆయిల్ పామ్ సాగుకు 100% రాయితీ

image

విశాఖ జిల్లాలో 100 హెక్టార్లలో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉద్యాన అధికారిణి శ్యామల తెలిపారు. రైతులకు 100% రాయితీపై మొక్కలు, అంతర పంటల నిర్వహణకు రూ.21,000 సాయం, డ్రిప్ సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇది 30 ఏళ్ల పాటు స్థిరమైన ఆదాయం ఇస్తుందని, భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల రైతులు ఆర్‌బీకేల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News December 8, 2025

జీవీఎంసీలో అడ్డగోలు ప్రతిపాదనలు వెనక్కి..!

image

జీవీఎంసీలో అభివృద్ధి పనులపై 287 అంశాలకు గాను 34 అంశాలను స్థాయి సంఘం ఆమోదం తెలపకూండా శనివారం వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదనలకు ఆమోదం విషయంలో కాంట్రాక్టర్లతో కుమ్మక్కు అయ్యారంటూ స్థాయి సంఘం సభ్యులపై వార్తలు రావడంతోనే వీటిని వాయిదా వేసినట్లు తెలుస్తోంది. చర్చ సమయంలో కొందరు అధికారుల తప్పిదాలకు తాము విమర్శలు ఎదుర్కోవల్సి వస్తుందని స్థాయి సంఘం చైర్మన్ పీలా శ్రీనివాసు సైతం వ్యాఖ్యానించారు.