News September 28, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో 4వేల మందిని తొలగిస్తారా.?: అయోధ్యరాం

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఒకేసారి 4,000 మంది కాంట్రాక్ట్ కార్మికులను యాజమాన్యం తొలగించిందని స్టీల్ ప్లాంట్ సీఐటీయూ గౌరవ అధ్యక్షుడు అయోధ్యరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై వివిధ కార్మిక సంఘాల నాయకులు తీవ్ర నిరసన తెలియజేయడంతో యాజమాన్యం దిగివచ్చిందన్నారు. తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకున్నట్లు తెలిపారు. దీనిపై స్టీల్ ప్లాంట్ అడ్మిన్ కార్యాలయం వద్ద శనివారం ధర్నా చేపట్టామన్నారు.

Similar News

News October 10, 2024

విజయవాడ-శ్రీకాకుళం రోడ్డు మధ్య ప్రత్యేక రైళ్లు

image

పండగల సీజన్‌లో విజయవాడ- శ్రీకాకుళం రోడ్డు-విజయవాడ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. విజయవాడ శ్రీకాకుళం స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఈనెల 10 నుంచి 17(13 మినహా) వరకు ప్రతిరోజు విజయవాడ నుంచి రాత్రి బయలుదేరి శ్రీకాకుళం రోడ్డు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణంలో శ్రీకాకుళం-విజయవాడ స్పెషల్ ఎక్స్ ప్రెస్ శ్రీకాకుళం నుంచి ఈనెల 10 నుంచి 18 వరకు(14 మినహా) నడుస్తుందన్నారు.

News October 10, 2024

విశాఖ వేదికగా మలబార్ విన్యాసాలు

image

విశాఖ వేదికగా జరుగుతున్న మలబార్-2024 విన్యాసాల ప్రారంభ వేడుకల్లో నాలుగు దేశాలకు చెందిన నౌకాదళాల అధికారులు పాల్గొన్నారు. హిందూ మహాసముద్రంలో సవాళ్లను పరిష్కరించడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానం పరస్పర మార్పిడి అవగాహన పెంపొందించుకునే లక్ష్యంతో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. అమెరికా జపాన్ ఆస్ట్రేలియా భారత్ దేశాల నౌకాదళాలు పాల్గొన్నాయి.

News October 10, 2024

విశాఖ: రూ.40 వేల జీతం.. దరఖాస్తులు ఆహ్వానం

image

కేజీహెచ్-ఏఎంసీలో నేషనల్ ఎమర్జెన్సీ లైఫ్ సపోర్ట్ సెంటర్లో కోర్స్ కోఆర్డినేటర్ పోస్ట్ కు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బుచ్చిబాబు తెలిపారు. నెలకు రూ.40 వేలు వేతనం చెల్లిస్తారని అన్నారు. నెల్స్ సిల్క్ ల్యాబ్‌లో పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 18లోగా పరిపాలన కార్యాలయం ఆంధ్ర మెడికల్ కాలేజీలో దరఖాస్తులు సమర్పించాలన్నారు.