News August 28, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్, ఐఓసీఎల్ మధ్య ఒప్పందం

విశాఖ స్టీల్ ప్లాంట్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ మధ్య మంగళవారం హైడ్రాలిక్ లూబ్రికేట్ ఆయిల్ గ్రీజు సరఫరాపై ఎంఓయూ జరిగింది. ప్లాంట్ ప్రధాన పరిపాలన భవనం సమావేశ మందిరంలో 2024-29 వరకు ఐదేళ్ల కాలపరిమితితో కూడిన అవగాహన ఒప్పందంపై ఇరు సంస్థల ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. ప్లాంట్ డైరెక్టర్ ఏకే బాగ్చీ, లూబ్స్ ఈడీ ఆర్.ఉదయ్ కుమార్, ప్లాంట్ సీజీఎం శ్రీధర్ సమక్షంలో ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.
Similar News
News November 9, 2025
మల్కాపురంలో యువకుడి మృతి

మల్కాపురంలోని ఓ బార్లో పనిచేసే యువకుడు శనివారం అర్ధరాత్రి ఆకస్మికంగా మృతి చెందాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం విజయరాంపురం గ్రామానికి చెందిన గణపతి మల్కాపురంలోని బార్లో పనిచేస్తున్నాడు. మద్యానికి బానిస కావడంతో అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం అర్ధరాత్రి బార్ వద్ద మృతి చెందినట్లు స్థానికులు గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 8, 2025
విశాఖ: ‘బెదిరించి రూ.14 లక్షలు దోచేశారు’

59 ఏళ్ల వ్యక్తికి ఫోన్ చేసి మీ నంబర్పై కేసు నమోదైందని బెదిరించి రూ.14 లక్షలు దోచుకున్న ఘటన విశాఖలో చోటుచేసుకుంది. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ CPని ఆశ్రయించారు. కేసు విచారణలో నిందితులుగా కృష్ణా జిల్లాకు చెందిన తారకేశ్వర్రావు, శివకృష్ణ, నాగరాజు, చందు, అబ్దుల్ కరీంగా గుర్తించారు. వీరు 350 నకిలీ సిమ్స్ తయారు చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు చెప్పారు. నిందితులను శనివారం అరెస్ట్ చేశామన్నారు.
News November 8, 2025
విశాఖ: నిర్మాణాల వద్ద వాలిపోతున్న చోటా నేతలు

సొంత ఇంటి నిర్మాణం మధ్యతరగతి కుటుంబాల కల. విశాఖలో కొందరు చోటా నాయకులు తమ ఆగడాలతో సామాన్యుల కలను చిదిమేస్తున్నారు. కొత్తగా ఇళ్లు నిర్మించుకోవాలంటే GVMCకి ఫీజులు చెల్లించి, టౌన్ ప్లానింగ్ అనుమతి తీసుకుంటే చాలు. కానీ ఈ నాయకులు ప్రజల నుంచి ముడుపులు వసూలు చేస్తుండటంతో.. ఈ వేధింపులు తాళలేక ఇటీవల ఓ ఇంటి యజమాని ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు సమాచారం. నగరంలో వీరి ఆగడాలకు చెక్ పెట్టాలని బాధితులు కోరుతున్నారు.


