News June 7, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై దృష్టి: పల్లా

image

విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ ప్రతినిధులు గురువారం గాజువాకలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును సత్కరించి అభినందించారు. స్టీల్ ప్లాంట్ సమస్యలను ఈ సందర్భంగా వారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్లాంట్ పరిరక్షణపై దృష్టి పెడతానన్నారు. ప్లాంట్ పరిరక్షణే లక్ష్యంగా పనిచేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్లాంట్ యూనియన్ నాయకులు ఆదినారాయణ పాల్గొన్నారు.

Similar News

News July 11, 2025

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’

image

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’‌ని ప్రవేశపెట్టాలని V.M.R.D.A. నిర్ణయించింది.‌ సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఈ రైడ్ అత్యంత ప్రజాదరణ పొందింది.‌ గురుత్వాకర్షణ ఆధారంగా ఈ వినోదాత్మక రైడ్ ఉంటుంది.‌ అన్ని వయస్సుల వారు ఈ రైడ్‌ను ఆస్వాదించవచ్చని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు.‌ కైలాసగిరిపై ఇది‌ మంచి టూరిస్టు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నామని ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.

News July 11, 2025

కైలాసగిరిపై ‘ఎకో హైట్స్’ కాటేజీలు

image

కైలాసగిరిపై ‘ఎకో హైట్స్’ కాటేజీలు నిర్మించనున్నామని V.M.R.D.A. ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.‌ 360 డిగ్రీ రివాల్వింగ్ ఫైన్ డైన్ రెస్టారెంట్, బే వ్యూ కేఫే కూడా అందుబాటులోకి రానున్నాయి.‌ వీటి కోసం RFP విడుదల చేయునున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులను V.M.R.D.A., ప్రైవేట్ పెట్టుబడిదారులకు పరస్పర లాభదాయకంగా (విన్-విన్) ఉండేలా నిర్మించనున్నారు.

News July 11, 2025

వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి: కలెక్టర్

image

సీజ‌న‌ల్ వ్యాధులు ప్ర‌బ‌ల‌కుండా ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అన్ని చోట్లా ఫాగింగ్ చేయాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ హరేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశామయ్యారు. అన్ని వ‌స‌తి గృహాల నిర్వ‌హ‌ణ‌పై ప్రత్యేక దృష్టి సారించాల‌ని, పారిశుద్ధ్య చ‌ర్య‌లు ప‌క్కాగా చేప‌ట్టాల‌ని సూచించారు. దోమ‌ల నివార‌ణ‌లో భాగంగా వీధులలో క్ర‌మం త‌ప్ప‌కుండా ఫాగింగ్ చేయాల‌ని చెప్పారు.