News August 3, 2024
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలు పీఎం దృష్టికి: సీఎం చంద్రబాబు
విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చినట్లు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు తెలిపారు. చంద్రబాబును వారు మంగళగిరి టీడీపీ కార్యాలయంలో కలిశారు. ప్లాంట్ సమస్యలను సీఎంకు వివరించారు. కార్మికులు అంకితభావంతో పనిచేసి పరిశ్రమను లాభాలు బాటలో నడిపితే స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తన వంతు కృషి చేస్తానని సీఎం హామీ ఇచ్చారని వారు తెలిపారు.
Similar News
News September 10, 2024
స్టీల్ ప్లాంట్ కార్మికులు రాస్తారోకో.. పరిస్థితి ఉధృతం
విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డుకుంటున్న పోలీసులతో కార్మికులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పలువురు కార్మికులను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు.
News September 10, 2024
విశాఖ: సహాయక చర్యల పై హోంమంత్రి సమీక్ష
వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలపై హోంమంత్రి వంగలపూడి అనిత విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పంట నష్టాన్ని అంచనా వేసి నివేదికను అందజేయాలన్నారు. పునరావాస కేంద్రాల్లో బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సీపీ శంఖబ్రత భాగ్చీ, జేసీ మయూర్ అశోక్ పాల్గొన్నారు.
News September 10, 2024
పల్లా శ్రీనివాసరావుకు అస్వస్థత..!
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల విజయవాడ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న ఆయన మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయనకు విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన అవసరం లేదని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.