News November 20, 2024

విశాఖ: స్టేడియం అభివృద్ధి ప‌నుల‌ ప‌రిశీలన-కలెక్టర్

image

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకొని ఇందిరా ప్రియ‌ద‌ర్శిని మున్సిప‌ల్ స్టేడియంలో మ‌రిన్ని మౌలిక వ‌స‌తులు క‌ల్పించాల‌ని సంబంధిత అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గ‌త కొంతకాలంగా సుమారు రూ.7 కోట్ల వ్యయంతో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను బుధ‌వారం ఆయ‌న ప‌రిశీలించారు. జీవీఎంసీ అధికారుల‌తో క‌లిసి స్టేడియంను సంద‌ర్శించిన ఆయ‌న అక్క‌డి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నించారు.

Similar News

News December 10, 2025

విశాఖలో నేటి నుంచి ఎక్కడికక్కడ పనులు బంద్

image

జీవీఎంసీ పరిధిలో కాంట్రాక్టర్లు బుధవారం నుంచి పనులు నిలిపివేయడానికి నిర్ణయం తీసుకున్నారు.18 నెలలు నుంచి కాంట్రాక్టర్లకు రూ.400 కోట్ల బకాయిలు ఉండగా బిల్లులు చెల్లించాలని పలు దఫాలుగా వినతులు ఇచ్చారు. మంగళవారం కమిషనర్‌కు నోటీసులు కూడా అందజేశారు. స్పందించకపోవడంతో నేటి నుంచి యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లోనూ కాంట్రాక్టర్లు పనులు నిలిపివేసేలా చర్యలు తీసుకున్నారు.

News December 10, 2025

14న విశాఖ తీరంలో నేవీ మారథాన్

image

విశాఖలో ఈనెల 14న ఈస్ట్రన్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో 10వ ఎడిషన్ నేవీ మారథాన్ జరగనుందని కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం తెలిపారు. ఆర్కేబీచ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీల్లో 17 దేశాల నుంచి 17,500 మంది పాల్గొంటున్నారు. 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో ఈ పరుగు కొనసాగుతుంది. ఏర్పాట్లు పక్కాగా చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.