News November 20, 2024
విశాఖ: స్టేడియం అభివృద్ధి పనుల పరిశీలన-కలెక్టర్
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో మరిన్ని మౌలిక వసతులు కల్పించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ఆదేశించారు. గత కొంతకాలంగా సుమారు రూ.7 కోట్ల వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. జీవీఎంసీ అధికారులతో కలిసి స్టేడియంను సందర్శించిన ఆయన అక్కడి పరిస్థితులను గమనించారు.
Similar News
News December 13, 2024
పెందుర్తి: మెగా, అల్లు ఫ్యామిలీలు ఒక్కటే: బొలిశెట్టి
అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంపై జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ‘X’ ద్వారా స్పందించారు. ‘హైకోర్టు తీర్పు రాకముందే అల్లు అర్జున్‌ను జైలుకు తరలించాలన్నది పోలీసుల అత్యుత్సాహంగా కనిపిస్తోంది. సంధ్య థియేటర్‌కు హీరో వస్తున్న విషయం మీడియాలో 2రోజుల ముందే వచ్చింది. CP తెలియదనడం హాస్యాస్పదం. మెగా, అల్లు ఫ్యామిలీలు రెండు కాదు ఒక్కటే.. ఈ తప్పుడు కేసు వల్ల అనేక నోర్లు మూతపడతాయి’ అని కీలక వ్యాఖ్యలు చేశారు.
News December 13, 2024
విశాఖ: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహార కేసులు వంటివి రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చనన్నారు.
News December 13, 2024
విశాఖ: ‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి’
విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వచ్చినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. గురువారం దీనిపై విశాఖ ఎంపీ శ్రీభరత్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రూ.14,309 కోట్ల ప్రతిపాదనలతో సమగ్ర మొబిలిటీ ప్లాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్లాన్ సరిగా లేకపోవడంతో మళ్లీ పంపించాలని కోరామన్నారు.