News March 2, 2025
విశాఖ: స్పా సెంటర్‌పై దాడి.. ఏడుగురి అరెస్ట్

విశాఖలోని సీతంపేట మార్గదర్శి ఆపోజిట్లో గల స్పా సెంటర్‌పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్‌లో దాడులతో మిగతా స్పా సెంటర్‌లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 20, 2025
VZM: నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలి: SP

సైబరు నేరాలను చేధించేందుకు నైపుణ్యాలను మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. స్థానిక పోలీస్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుళ్లకు బుధవారం అవగాహన కల్పించారు. రాబోయే రోజుల్లో సైబరు నేరాలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. నేరాలను నియంత్రించుట, నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టుటకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతీ పోలీసు అధికారి మెరుగుపర్చుకోవాలన్నారు.
News March 19, 2025
VZM: ZP ఛైర్మన్‌కు మాజీ CM జగన్ పరామర్శ

విజయనగరం జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాస్ రెండో కుమారుడు ప్రణీత్ బాబు బుధవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ఫోన్‌లో చిన్న శ్రీనును పరామర్శించారు. మృతికి గల కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. చిన్న శ్రీను కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే మనోధైర్యంగా ఉండాలంటూ జగన్ ధైర్యం చెప్పారు.
News March 19, 2025
VZM: “టెన్త్ పరీక్షకు 94 మంది గైర్హాజరు”

బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన 10వ తరగతి హిందీ పరీక్షకు 94 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈవో యు.మాణిక్యం నాయుడు ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 119 కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకి మొత్తం 22,834 విద్యార్థులకు గాను 22740 మంది విద్యార్థులు హాజరయ్యారని అన్నారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్షలు సజావుగా జరిగిందని తెలియజేశారు.