News March 2, 2025
విశాఖ: స్పా సెంటర్‌పై దాడి.. ఏడుగురి అరెస్ట్

విశాఖలోని సీతంపేలోని ఓ స్పా సెంటర్‌పై ద్వారక నగర్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. వీరంతా వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఒక్కసారిగా స్పా సెంటర్‌లో దాడులతో మిగతా స్పా సెంటర్‌లలో అలజడి నెలకొంది. ద్వారక నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 24, 2025
మహిళలకు సూపర్ స్కీమ్.. నెలాఖరు వరకే గడువు

భారత మహిళలకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పోస్టాఫీస్ సేవింగ్స్ పథకం MSSC. రూ.1000 నుంచి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేసుకోవచ్చు. రెండేళ్ల తర్వాత 7.5 శాతం వడ్డీతో కలిపి మొత్తం తీసుకోవచ్చు. అత్యవసరమైనప్పుడు డిపాజిట్‌లో 40శాతాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. పోస్టాఫీస్ అధికారిక వెబ్‌సైట్‌లో ఫామ్ లభిస్తుంది. ఈ నెలాఖరుకే పథకం ఆగిపోనుంది. మరిన్ని వివరాలకు సమీప పోస్టాఫీసును సంప్రదించవచ్చు. షేర్ చేయండి.
News March 24, 2025
TODAY HEADLINES

* KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్
* రేషన్ కార్డుదారులకు 6 కేజీల సన్నబియ్యం: ఉత్తమ్
* TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌కు సుప్రీం నోటీసులు
* 27న పోలవరానికి సీఎం చంద్రబాబు
* వారు కూడా దక్షిణ భాషలు అర్థం చేసుకోవాలి: పవన్
* ఎన్నికల్లో కపట హామీలు.. గెలిచాక ఊసే ఉండదు: వైసీపీ
* RRపై SRH విజయం, MIపై చెన్నై విక్టరీ
* బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS
News March 24, 2025
HYD: సైబర్ నేరగాలపై టీజీసీఎస్బీ కీలక సూచన

HYD: కార్పొరెట్ కంపెనీల్లో అన్‌లైన్ చెల్లింపులపై జాగ్రత్త వహించాలని టీజీసీఎస్బీ శిఖా గోయల్ తెలిపారు. గోయల్ మాట్లాడుతూ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి కాల్స్ వచ్చినట్లు అనిపిస్తే లావాదేవీలు చేసే ముందు ఆథరైజ్డ్ కమ్యూనికేషన్ ద్వారా ధృవీకరించుకుని చెల్లింపులు చేయాలని సూచించారు. ఇటీవల ఓ కంపెనీ ఎండీ పేరుతో అకౌటెంట్‌కి సైబర్ నేరగాళ్లు వాట్సప్ కాల్ చేశారని పెద్దమొత్తంలో డబ్బులు ట్రాన్సర్ చేశారన్నారు.