News July 3, 2024

విశాఖ: స్వామీజీలపై దుష్ప్రచారం మానుకోవాలి- వీహెచ్పీ

image

స్వార్థపరమైన రాజకీయ దురుద్దేశంతో హిందూమత స్వామిపై దుష్ప్రచారం తగదని వీహెచ్పీ నేత విజయ శంకర్ ఫణి హితవు పలికారు. డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్ క్లబ్‌లో బుధవారం పెందుర్తి బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. విజయ శంకర్‌ మాట్లాడుతూ ఇటీవల కొంత మంది స్వలాభం, వైఖరి వల్ల బ్రాహ్మణ వ్యవస్థకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాముల మీద దుష్ప్రచారం తగదన్నారు.

Similar News

News December 10, 2025

విశాఖ: DRO, RDOల నియామ‌కంలో మీన‌మేషాలు

image

విశాఖలో రెగ్యులర్ అధికారుల‌ను నియ‌మించ‌డంలో ప్ర‌భుత్వం మీన‌మేషాలు లెక్కిస్తోంది. DRO, RDOల మ‌ధ్య వివాదం జరగ్గా.. ఇద్ద‌రినీ స‌రెండ‌ర్ చేశారు. 2 నెల‌లు కావొస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు రెగ్యుల‌ర్ అధికారుల‌ను నియ‌మించ‌లేదు. ఇన్‌ఛార్జ్ హోదాల్లో ఉన్నవారు పెద్ద‌ పెద్ద ప‌నుల విష‌యంలో త‌ల‌దూర్చడం లేదు. తాత్కాలిక‌మైన ప‌నుల‌నే చూసుకొని వెళ్లిపోతున్నారు. దీంతో కీల‌క‌ నిర్ణ‌యాల విష‌యంలో ఇబ్బందులు త‌లెత్తుతున్నాయి.

News December 9, 2025

జీవీఎంసీలో అవినీతిపై కమిషనర్ ఉక్కుపాదం

image

జీవీఎంసీలో అవినీతిని ఉపేక్షించేది లేదని కమిషనర్ కేతన్ గార్గ్ స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలపై ఇప్పటికే ఒక డీఈఈ (DEE), టీపీవో (TPO)ను సరెండర్ చేశామని, ఏఈ (AE)పై విచారణకు ఆదేశించామని తెలిపారు. అవినీతికి పాల్పడే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉద్యోగులంతా పారదర్శకంగా పనిచేసి నగర అభివృద్ధికి సహకరించాలని ఆదేశించారు.

News December 9, 2025

ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంఘం నూతన కమిటీ ఎన్నిక

image

ఏపీ ఈపీడీసీఎల్ ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం డిస్కం నూతన కమిటీని విశాఖలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా సిహెచ్.సాయిబాబు, అధ్యక్షుడిగా ఎం.నిరంజన్ బాబు, జనరల్ సెక్రటరీగా ఎన్.వెంకటరావు ఎన్నికయ్యారు. మెజారిటీ సభ్యుల ఆమోదంతో ఏర్పాటైన ఈ కమిటీ మూడేళ్లు కొనసాగుతుందని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని సాయిబాబు తెలిపారు.