News November 29, 2024
విశాఖ: హత్య కేసులో నిందితుడికి యావజ్జీవ శిక్ష
ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని హత్య చేసిన సంఘటనలో నిందితుడు పచ్చిపాల గోవింద్‌కు ఏడీజీ న్యాయస్థానం యావజ్జీవ కఠిన కారాగార శిక్షతోపాటు రూ.2,000 జరిమానా విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చింది. 2022లో చిత్తు కాగితాలు ఏరుకునే వ్యక్తితో గోవిందు గొడవపడ్డాడు. కాగితాలు ఏరుకునే వ్యక్తి నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడ్డుతో దాడి చేసి గోవిందు హత్య చేశాడు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.
Similar News
News December 13, 2024
విశాఖ: ‘లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి’
ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ నెల 14న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని విశాఖ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆలపాటి గిరిధర్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం కోర్టు ప్రాంగణంలో ఆయన మాట్లాడారు. న్యాయస్థానాల్లో ఉన్న పెండింగ్ కేసులు, సివిల్, చెక్ బౌన్స్, బ్యాంకింగ్, మోటార్ ప్రమాదాల నష్టపరిహార కేసులు వంటివి రాజీ మార్గంలో పరిష్కరించుకోవచ్చనన్నారు.
News December 13, 2024
విశాఖ: ‘రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి’
విశాఖ లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రతిపాదనలు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రానికి వచ్చినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. గురువారం దీనిపై విశాఖ ఎంపీ శ్రీభరత్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. రూ.14,309 కోట్ల ప్రతిపాదనలతో సమగ్ర మొబిలిటీ ప్లాన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపించినట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్లాన్ సరిగా లేకపోవడంతో మళ్లీ పంపించాలని కోరామన్నారు.
News December 13, 2024
విశాఖలో యువకుడి మృతిపై స్పందించిన మంత్రి లోకేశ్
విశాఖ కలెక్టరేట్ సమీపంలోని అంగడిదిబ్బకు చెందిన నరేంద్ర(21) లోన్‌యాప్ వేధింపులకు బలి అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై కలెక్టర్‌ల కాన్ఫిరెన్స్‌లో మంత్రి లోకేశ్ ప్రస్తావించారు. యువకుడి ఫొటోతో పాటు అతని భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి బంధువులకు పంపి ఆత్మహత్యకు కారణమయ్యారు. దీనిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరగా క్యాబినెట్ సబ్ కమిటీ ప్రకటించారు. దీనిపై చిట్టా బయటకు తీస్తామని విజిలెన్స్ డీజీ తెలిపారు.