News June 17, 2024
విశాఖ: హాల్ టికెట్స్ విడుదల

విశాఖపట్నం జిల్లాలోని మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలల్లో 6,7,8,9 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్లు భర్తీకి ఆన్లైన్లో అప్లై చేసుకున్న విద్యార్థులకు హాల్ టికెట్లు విడుదలయ్యాయి. హాల్ టికెట్లను https://mjpapbcwreis.apcfss.inలో డౌన్లోడ్ చేసుకోవాలని విశాఖ జిల్లా గురుకుల పాఠశాలల కన్వీనర్ దాసరి సత్యారావు సూచించారు.
Similar News
News October 23, 2025
విశాఖ: క్రికెట్ బెట్టింగ్ ముఠా సహాయకుల అరెస్ట్

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాలతో సైబర్ క్రైమ్ పోలీసులు ఇదివరకే క్రికెట్ బెట్టింగ్ కేసులో ముద్దాయిలను దర్యాప్తు చేశారు. దర్యాప్తులో మరో ఇద్దరిని గురువారం అరెస్ట్ చేశారు. ‘exchange 666’ అనే బెట్టింగ్ యాప్‌తో బెట్టింగ్ చేస్తున్న అచ్యుతాపురానికి చెందిన మాసారపు దక్షిణామూర్తి, చుక్క రఘు రామ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న ఇదే బెట్టింగ్ కేసులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
News October 23, 2025
మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు: జేసీ

బడి పిల్లలకు అందించే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జేసి మయూర్ అశోక్ తెలిపారు. గురువారం విశాఖ కలెక్టరేట్లో మధ్యాహ్న బడి భోజనం పథకానికి సంబంధించిన పలు అంశాలపై సమావేశం నిర్వహించారు. క్వాలిటీ, క్వాంటిటీల్లో రాజీ పడకూడదన్నారు. ఎంపీడీవోలు బీసీ, ఎస్సీ హాస్టల్లో మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నరా అని తరచూ తనిఖీలు నిర్వహించాలన్నారు.
News October 23, 2025
తాడేపల్లి కేంద్రంగా నకిలీ మద్యం కుట్ర: టీడీపీ

గాజువాకలో టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా నకిలీ మద్యం కుట్ర జరిగిందని, జోగి రమేష్ – జనార్ధన్‌రావుల ప్రమేయంతోనే కల్తీ తయారైందని పల్లా ఆరోపించారు. ఏపీ సురక్షా యాప్‌ను లాంచ్ చేసి, కల్తీని అరికట్టేందుకు QR కోడ్ విధానం, 13 రకాల టెస్టులు ప్రవేశపెట్టామని చెప్పారు.