News September 25, 2024
విశాఖ: హెల్త్ వర్కర్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
విశాఖ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు శిక్షణ కేంద్రాల్లో మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారు. వివరాలకు ప్రభుత్వ వెబ్ సైట్‌ను సందర్శించాలన్నారు.
Similar News
News October 16, 2024
సిరిమానును తిలకించిన విశాఖ ఎంపీ
విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో విశాఖ ఎంపీ శ్రీభరత్ పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజుతో కలిసి కోట నుంచి సిరిమానును ఆయన తిలకించారు. వారితో పాటు రాజ కుటుంబీకులు, జిల్లా ప్రజాప్రతినిదులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.
News October 15, 2024
పెందుర్తిలో దారుణం.. తండ్రిని చంపేసిన కొడుకు
పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో నరవ సమీపంలోని మన్యం కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో కన్నతండ్రిని కడతేర్చాడు. దసరా నుంచి మద్యం సేవిస్తూ గొడవ పడుతున్న గోపి.. తండ్రి దేముడును మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో పీక కోసేశాడు. సంఘటన స్థలములోనే దేముడు మృతి చెందగా.. స్థానికుల ఫిర్యాదుతో పెందుర్తి పోలీసులు ఘటనాస్థలంలో గోపిని అదుపులో తీసుకున్నారు.
News October 15, 2024
ఉమ్మడి విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రులు వీరే..!
అనకాపల్లి జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా కొల్లు రవీంద్రను ప్రభుత్వం నియమించింది. జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా బాల వీరాంజనేయులును ప్రభుత్వం నియమించింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన హోం మంత్రి అనితను విజయనగరం జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రిగా, అల్లూరి జిల్లాకు గుమ్మడి సంధ్యారాణిని ఇన్ ఛార్జ్ మంత్రిగా ప్రభుత్వం నియమించింది.