News October 14, 2024
విశాఖ: 150 మద్యం షాపులకు 4139 దరఖాస్తులు

విశాఖ జిల్లాలో 150 మద్యం షాపులకు 4139 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. ఈనెల 14 ఉదయం 8 గంటల నుంచి వుడా చిల్డ్రన్ ఎరీనాలో మద్యం షాపుల కేటాయింపుకు జరిగే లాటరీ ప్రక్రియ ఏర్పాట్లను ఆయన ఆదివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దరఖాస్తులు అధికంగా రావడంతో ఎక్కువమంది పాల్గొనే అవకాశం ఉందన్నారు. ఇందుకు తగ్గట్టుగా ఎక్కువ కౌంటర్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
Similar News
News November 7, 2025
విశాఖ: పాఠశాలలకు రేపు సెలవు రద్దు

విశాఖలో రేపు రెండో శనివారం సందర్భంగా సెలవు రద్దు చేసినట్లు డీఈవో ఎన్.ప్రేమ్ కుమార్ శుక్రవారం ప్రకటించారు. తుఫాన్ కారణంగా అక్టోబర్ 27న పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో.. ఆ రోజుకు బదులుగా రేపు పని దినంగా నిర్ణయించారు. ఈ మేరకు అన్ని మేనేజ్మెంట్ల పాఠశాలలు రేపు సాధారణంగా పనిచేయాలని, విద్యార్థులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.
News November 7, 2025
విశాఖ రేంజ్లో వందేమాతరం గీతాలాపన

విశాఖ రేంజ్ పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ‘వందేమాతరం’ గీతాలాపన చేశారు. జాతీయ గీతాన్ని రచించి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. డీఐజీ గోపీనాథ్ జెట్టి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన వీరులను స్మరించుకోవాలని, జాతీయ గీతాల పట్ల గౌరవ భావం కలిగి ఉండాలని సూచించారు.
News November 7, 2025
విశాఖ: ఎయిర్పోర్ట్ రహదారిలో యాక్సిడెంట్.. వ్యక్తి మృతి

షీలానగర్ నుంచి ఎన్ఏడీ వైపు వస్తున్న రహదారిలో శుక్రవారం యాక్సిడెంట్ జరిగింది. ఎయిర్పోర్ట్ సమీపంలో స్కూటీపై వెళ్తున్న వ్యక్తిని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సదరు వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని వివరాలపై ఆరా తీస్తున్నారు.


