News February 20, 2025

 విశాఖ: 16 కేంద్రాల్లో గ్రూప్-2 ప‌రీక్ష‌ నిర్వహణ

image

ఫిబ్రవరి 23న జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఏపీపీఎస్సీ ఆధ్వ‌ర్యంలో గ్రూప్ -2 ప‌రీక్ష జ‌ర‌గ‌నుంద‌ని, పటిష్ఠ ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. గురువారం ఉద‌యం క‌లెక్ట‌రేట్ వీసీ హాలులో జిల్లా అధికారులు, ఏపీపీఎస్సీ అధికారులు, ప‌రీక్షా కేంద్రాల‌ నిర్వాహ‌కుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశమైన ఆయ‌న ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు.

Similar News

News February 22, 2025

విశాఖలోని 16 సెంటర్లలో గ్రూప్-2 పరీక్ష: జేసీ

image

విశాఖ జిల్లాలో 16 ఎగ్జామ్స్ సెంటర్లలో రేపు గ్రూప్-2 పరీక్ష నిర్వహించనునట్లు జాయింట్ కలెక్టర్ మాయూర్ అశోక్ తెలిపారు. ఉదయం 10 నుంచి 12:30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 3 నుంచి 5:30 వరకు పేపర్ -2 పరీక్ష ఉండనుందన్నారు. పరీక్షా సమయానికి 15 నిమిషాలు ముందుగా అభ్యర్థులు ఎగ్జామ్స్ సెంటర్లకు హాజరు కావాలన్నారు. విశాఖ జిల్లాలో మొత్తం 16 కేంద్రాలలో 11,029 అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు తెలిపారు.

News February 22, 2025

వెంకోజిపాలెం వైపు ట్రాఫిక్ డైవర్షన్

image

విశాఖలో ఇసుకతోట జాతీయ రహదారిపై గ్రూప్-2 అభ్యర్థులు శనివారం ధర్నాకు దిగారు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపడుతున్నారు. కొన్ని వాహనాలను వెంకోజిపాలెం మీదుగా ఎంవీపీ కాలనీ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వైపు దారి మళ్ళించారు. మరికొన్ని వాహనాలను హెచ్‌బి కాలనీ మీదుగా సీతమ్మధార వైపు దారి మళ్ళించారు.

News February 22, 2025

విశాఖలో 300 మంది పోలీసులకు రివార్డులు

image

విశాఖ నగర పరిధిలో ప్రతిభ కనబర్చిన 300 మంది పోలీస్ సిబ్బందికి సీపీ శంఖబ్రత బాగ్చి శనివారం రివార్డులు అందజేశారు. హోంగార్డు నుంచి సీఐ స్థాయి అధికారుల వరకూ రివార్డులు అందజేశారు. గంజాయి సీజ్ చేసిన పలు కేసులలో చోరీ కాబడిన సొత్తు, ఇతర వస్తువులను రికవరీ చేసి, సైబర్ క్రైమ్ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన, ముఖ్యపాత్ర పోషించిన సిబ్బందికి ప్రశంస పత్రాలు అందజేశారు. సీపీ ప్రతి నెల రివార్డులను అందజేస్తున్నారు.

error: Content is protected !!