News June 15, 2024

విశాఖ: 17న పలు రైళ్లను రద్దు  

image

వాల్తేరు డివిజన్ పరిధిలోని కోటబొమ్మాళి-టీలేరు వంతెన మరమ్మతుల కారణంగా17న పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డీసీఎం సందీప్ తెలిపారు. 17న పలాస-విశాఖ-పలాస పాసింజర్ రైలు, విశాఖ-గుణుపూర్-విశాఖ పాసింజర్ రైలును రద్దు చేసినట్లు తెలిపారు. అలాగే 17న బయలుదేరే విశాఖ-బ్రహ్మపూర్, 18న బయలుదేరే బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్ ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు.

Similar News

News November 27, 2025

విశాఖ: మెడికల్ షాపుల్లో తనిఖీలు.. ఒకటి సీజ్

image

విశాఖలో పలుచోట్ల డ్రగ్ కంట్రోలర్ సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ షాపుల తనిఖీలు చేపట్టారు. డాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోహన్ ఫార్మసీ దుకాణాలు నడుస్తున్నాయి. వీటిపై PGRSలో ఫిర్యాదులు రావడంతో తనిఖీలు చేసి ఎంవీపీ బ్రాంచ్ సీజ్ చేశారు. వన్ టౌన్, ఇసుకతోట, ఎంవీపీ, కంచరపాలెం, మల్కాపురం షాపులకు నోటీసులు జారీ చేసినట్లు డ్రగ్ కంట్రోలర్ తెలిపారు. అధిక ధరలు, కాలం చెల్లిన మందులు ఉన్నాయని ఆయన చెప్పారు.

News November 27, 2025

విశాఖ: బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి

image

బస్సు చక్రాల కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన ఇవాళ తెల్లవారుజామున జరిగింది. సింహాచలం డిపో నుంచి గోపాలపట్నం వైపు బస్సు వెళుతుండగా.. రోడ్డు మీద నడుస్తున్న ఒక వ్యక్తి అకస్మాత్తుగా చక్రాల కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గోపాలపట్నం ఎస్సై అప్పలనాయుడు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 26, 2025

28న విశాఖ ఉమెన్స్ కాలేజీలో మెగా జాబ్ మేళా

image

విశాఖలోని ప్రభుత్వ ఉమెన్స్ కాలేజీలో 28న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు కాలేజీ ఆవరణలో పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ప్రముఖ ఐటీ కంపెనీలు, పరిశ్రమల యాజమాన్య నిర్వాహకులు జాబ్ మేళాలో పాల్గొని ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. యువతీ యువకులు అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కోరారు.