News April 4, 2025

విశాఖ: 20 బైక్‌లు సీజ్

image

విశాఖలో ట్రాఫిక్ పోలీసులు 20 బైక్‌లను సీజ్ చేశారు. ఇన్‌ఛార్జ్ ఉప రవాణా కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాల మేరకు NAD, మద్దిలపాలెం ప్రాంతాల్లో గురువారం తనిఖీలు చేపట్టారు. వాహనం నడిపేవారు, వెనుక కూర్చున్న వ్యక్తి హెల్మెట్ పెట్టుకోకుండా మొదటిసారి దొరికిన వారి లైసెన్స్ 3 నెలలు రద్దు చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ రెండోసారి దొరికిన వారి వాహనాలను సీజ్ చేసినట్లు రవాణా శాఖ అధికారులు తెలిపారు.

Similar News

News April 5, 2025

విశాఖ: ఉరేసుకుని విశ్రాంత ఉద్యోగి మృతి

image

విశాఖలోని లాసన్స్‌బే కాలనీలో విశ్రాంత ఉద్యోగి గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కాలనీకి చెందిన డానియల్ మిల్టన్(64) ఏలూరు జిల్లా కోపరేటివ్ బ్యాంకులో జాయింట్ రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించి, జూన్ 2024లో పదవీ విరమణ పొందారు. అనంతరం మిల్టన్‌కు అందాల్సిన ప్రయోజనాలు అందలేదని, మనస్తాపానికి గురై ఉరేసుకున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News April 5, 2025

విశాఖ తీరంలో అమెరికా యుద్ధ విన్యాసాలు

image

విశాఖ తీరానికి సైనికులతో ఉన్న అమెరికా దేశ యుద్ధ నౌకలు వచ్చాయి. ఇండో పసిఫిక్ ప్రాంతం భద్రతకు దిక్సూచిగా భారత్- అమెరికా సంయుక్తంగా నిర్వహిస్తున్న టైగర్ ట్రయాంఫ్ 2025 విన్యాసాల్లో పాల్గొనడానికి విశాఖ తీరానికి చేరుకున్నాయి. ఈ నెల ఏడో తేదీ వరకు హార్బర్ ఫేజ్‌లో విన్యాసాలు జరుగుతాయి. అమెరికా యుద్ధనౌక యూఎస్ కంస్టాక్, రాల్స్ జాన్సన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

News April 5, 2025

అప్పన్న స్వామి దర్శన వేళలో మార్పులు ఇవే..

image

ఈ నెల 8వతేదీ సింహద్రి అప్పన్న స్వామి వార్షిక తిరు కళ్యాణ మహోత్సవం నేపథ్యంలో ఈనెల 7 నుంచి 24వరకు దర్శన వేళ్లలో మార్పులు చేశారు. ఈ రోజుల్లో అర్జీత సేవలు ఉండవని అర్చకులు టి.పి.రాజగోపాల్ తెలిపారు. 7వ తేదీ నుంచి 14 వరకు సుప్రభాత సేవ, ఉదయం, రాత్రి ఆరాధన సేవల్లో భాగస్వామ్యం ఉండదన్నారు. అలాగే రాత్రి 7 గంటల తర్వాత భక్తులకు దర్శనాలు ఉండవు. 10వ తేదీన ఉదయం 8గంటల తర్వాత సర్వ దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

error: Content is protected !!