News May 19, 2024

విశాఖ: 24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఈనెల 24 నుంచి జరగనున్న ఇంటర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్ఐఓ మురళీధర్ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు ఉన్న 172 జూనియర్ కళాశాలల నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం జనరల్ కోర్సులకు 31,152 మంది ఒకేషనల్ కోర్సులకు 636 మంది హాజరవుతున్నట్లు తెలిపారు. ద్వితీయ సంవత్సరం జనరల్ కోర్సులకు 7,774 మంది ఒకేషనల్ కోర్సులకు 455 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News October 31, 2025

గడువులోగా మాస్టర్ ప్లాన్ రహదారులు పూర్తి చేయాలి: VMRDA ఛైర్మన్

image

భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానించే ప్రధాన రహదారుల పనులను గడువులోగా పూర్తి చేయాలని VMRDA ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. మాస్టర్ ప్లాన్‌లోని 7 రహదారుల పురోగతిని ప్రతి 15 రోజులకు సమీక్షించనున్నట్లు తెలిపారు. కైలాసగిరిపై త్రిశూల్ ప్రాజెక్ట్, వుడా పార్క్‌లో స్కేట్ బోర్డ్ పనులు కూడా సకాలంలో పూర్తిచేయాలని సూచించారు.

News October 30, 2025

విశాఖ: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ అధికారుల తనిఖీలు

image

రవాణా కమీషనర్ ఆదేశాల మేరకు గురువారం రవాణా శాఖ అధికారులు విశాఖలో పలు చోట్ల తనిఖీలు చేశారు. 36 వాహనాలను తనిఖీ చేశారు. రహదారి నియమాలు పాటించకుండ, పర్మిట్ నియమాలను అతిక్రమించి తిరుగుతున్న ఒక బస్సుపై కేసు నమోదు చేశారు. ఈ తనిఖీలలో టాక్స్, పెనాల్టీ రూపేణా 2,45,000 వసులు చేశారు. ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయన్నారు.

News October 30, 2025

విశాఖ నగర డీసీపీ-1గా జగదీశ్ అడహళ్లి నియామకం

image

ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి జగదీశ్ అడహళ్లిని విశాఖపట్నం నగర డీసీపీ-1గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020లో UPSCలో 440వ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అధికారి అయిన ఆయన, మొదట అసిస్టెంట్ కమిషనర్‌గా పని చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. ఇటీవల అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఏఎస్పీగా పనిచేసిన జగదీశ్ అడహళ్లి తాజా బదిలీతో విశాఖ డీసీపీ-1 నియమితులయ్యారు.