News June 23, 2024
విశాఖ: 24, 25 తేదీల్లో రద్దయిన రైళ్ల జాబితా ఇదే..
పలాస-విజయనగరం లైన్‌లో వంతెన పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా 24, 25 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేసినట్లు వాల్తేరు డివిజన్ డీసీఎం కె.సందీప్ తెలిపారు. 24న పలాస-విశాఖ-పలాస, విశాఖ-గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ రైలు 24న విశాఖ-బ్రహ్మపూర్, 25న బ్రహ్మపూర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసినట్లు తెలిపారు. అదే విధంగా 24న విశాఖ-భువనేశ్వర్, 25న భువనేశ్వర్-విశాఖ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశామన్నారు.
Similar News
News November 12, 2024
విశాఖ: స్మశాన వాటికలో కార్పొరేటర్ నిరసన దీక్ష
జీవీఎంసీ 22వ వార్డు స్మశాన వాటికలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆధ్వర్యంలో బుధవారం(రేపు) నిరసన దీక్ష చేపట్టనున్నట్లు కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ తెలిపారు. స్మశాన వాటిక అభివృద్ధి పనుల విషయంలో అధికారులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రెండేళ్లు కావస్తున్నా అభివృద్ధి పనులు ప్రారంభం కాలేదు అన్నారు. జీవీఎంసీ అధికారుల నిర్లక్ష్య వైఖరే దీనికి కారణం అన్నారు.
News November 12, 2024
విశాఖలో పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లపువానిపాలెంలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ ఈశ్వర్ రావు(16) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటిలో ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. కడుపు నొప్పి తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గోపాలపట్నం పోలీసులు మంగళవారం ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News November 12, 2024
విశాఖ: వరకట్న వేధింపులతో వివాహిత సూసైడ్
వరకట్న వేధింపులతో విశాఖలో ఓ వివాహిత సూసైడ్ చేసుకుంది. 4వ టౌన్ పోలీసల వివరాల ప్రకారం.. దిల్లేశ్వరి అక్కయ్యపాలేనికి చెందిన రాజశేఖర్‌ని పెళ్లిచేసుకుంది. వ్యాపారం కోసం డబ్బులు కావాలని భర్త వేధించడంతో పుట్టింటి నుంచి రూ.6 లక్షలు తెచ్చింది. అయినప్పటికీ హింసించడంతో ఆదివారం సూసైడ్ చేసుకుంది. దిల్లేశ్వరి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేసి ఆమె భర్త, అత్తపై కేసు నమోదు చేశారు.