News June 15, 2024
విశాఖ: 28న 100వ తపాలా డాక్ అదాలత్

తపాలా వినియోగదారుల సమస్యలు ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 28న విశాఖ నగరం ఎంవీపీ కాలనీలోని తపాలా శాఖ రీజినల్ కార్యాలయంలో 100వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ప్రసన్న రెడ్డి తెలిపారు. అల్లూరి, పార్వతీపురం, కోనసీమ, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తపాలా వినియోగదారులు సమస్యలను ఈనెల 21వ తేదీలోగా రీజినల్ కార్యాలయం చిరునామాకు అందజేయాలన్నారు.
Similar News
News December 9, 2025
విశాఖలో కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించనున్న CM

CM చంద్రబాబు ఈనెల 12న విశాఖలో పర్యటించనున్నారు. ముందుగా మధురవాడ ఐటీ సెజ్ హిల్-2లో ప్రముఖ IT కంపెనీ కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. అదేవిధంగా కాపులుప్పాడలో ఆ సంస్థకు ప్రభుత్వం కేటాయించిన భూముల్లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం వీఈఆర్ సమావేశానికి హాజరై, వివిధ అభివృద్ధి అంశాలపై సమీక్ష చేస్తారు. పర్యటనకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
News December 9, 2025
విశాఖలో టెట్ పరీక్షలు.. అభ్యర్థులకు డీఈవో కీలక సూచనలు

విశాఖ జిల్లాలో AP TET-2025 పరీక్షలు డిసెంబర్ 10 నుంచి 21 వరకు 12 కేంద్రాల్లో ఆన్లైన్ (CBT) విధానంలో జరగనున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ తప్పక తీసుకురావాలని, పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్కు చేరుకోవాలని ఆయన సూచించారు. నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమని స్పష్టం చేశారు.
News December 9, 2025
విశాఖ: పలు రైళ్లు రద్దు.. మరికొన్ని కుదింపు

భద్రతా పనుల కారణంగా కేకే లైన్లో పలు రైళ్లను నియంత్రిస్తున్నట్లు వాల్తేరు డివిజన్ సీనియర్ డీసీఎం పవన్ కుమార్ తెలిపారు. డిసెంబర్ 9, 10వ తేదీల్లో విశాఖ-కిరండూల్, హీరాఖండ్, రూర్కెలా ఎక్స్ప్రెస్ కోరాపుట్ లేదా దంతెవాడ వరకే నడుస్తాయి. అదేవిధంగా డిసెంబర్ 13, 15వ తేదీల్లో విశాఖ-కిరండూల్ పాసింజర్ రైలు విశాఖపట్నం-కోరాపుట్ మధ్య రద్దు చేయబడింది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలి.


