News June 15, 2024

విశాఖ: 28న 100వ తపాలా డాక్ అదాలత్

image

తపాలా వినియోగదారుల సమస్యలు ఫిర్యాదుల పరిష్కారానికి ఈ నెల 28న విశాఖ నగరం ఎంవీపీ కాలనీలోని తపాలా శాఖ రీజినల్ కార్యాలయంలో 100వ తపాలా డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు పోస్టల్ సూపరింటెండెంట్ ప్రసన్న రెడ్డి తెలిపారు. అల్లూరి, పార్వతీపురం, కోనసీమ, కాకినాడ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన తపాలా వినియోగదారులు సమస్యలను ఈనెల 21వ తేదీలోగా రీజినల్ కార్యాలయం చిరునామాకు అందజేయాలన్నారు.

Similar News

News September 18, 2024

భీమిలి: స్కూల్ బస్సు కింద పడి విద్యార్థి మృతి

image

భీమిలి మండలం నారాయణరాజుపేట గ్రామంలో విషాదం నెలకొంది. రౌడి గ్రామంలోని నర్సరీ చదువుతున్న బి.వేణు తేజ(5) బస్సు దిగి వెనుక వైపు నిల్చున్నాడు. గమనించని డ్రైవర్ రివర్స్ చేయగా.. ఆ బాలుడు బస్సు వెనుక చక్రాల కింద పడి చనిపోయాడు. బస్సు ఆ చిన్నారి తలపై నుంచి వెళ్లిపోయింది. బస్సు‌కు క్లీనర్ లేకపోవడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో ఆ గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

News September 18, 2024

విశాఖ: ‘పిల్లల ఉజ్వల భవిష్యత్‌కు ఎన్.పి.ఎస్ వాత్సల్య’

image

పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్.పి.ఎస్ వాత్సల్య యోజన పథకం ఎంతో దోహదపడుతుందని ఎస్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ పంకజ్ కుమార్ అన్నారు. ఢిల్లీలో ఈ పథకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం ప్రారంభించారు. సిరిపురం వద్ద ఎస్బీఐ పరిపాలన విభాగంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ పథకం దీర్ఘకాలంలో సంపదను సృష్టిస్తుందన్నారు.

News September 18, 2024

విశాఖ: పర్యాటక అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ

image

ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 27న‌ అవార్డులు అందజేసేందుకు వీలుగా 2023- 24 సంవత్సరానికి అర్హులైన పర్యాటక రంగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు విశాఖ కలెక్టర్ ఎం.ఎన్.హ‌రేంధిర ప్ర‌సాద్ బుధ‌వారం ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. www.aptourism.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకొని ఏపీ టూరిజం అథారిటీ, 5వ ఫ్లోర్, స్టాలిన్ కార్పొరేట్ బిల్డింగ్, ఆటోనగర్, విజయవాడ చిరునామాకు అందచేయాలన్నారు.