News March 25, 2025
విశాఖ: 30 మంది అనాథ చిన్నారులకు మ్యాచ్ చూసే అవకాశం

వైజాగ్ క్రికెట్ స్టేడియంలో సోమవారం జరగనున్న మ్యాచ్‌ను ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ 30 మంది అనాథ చిన్నారులకు చూసే అవకాశం కల్పించింది. సొంత నిధులతో 30 టికెట్స్ కొని వైజాగ్‌లోని పాపా హోమ్ అనాథ శరణాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ వీక్షించేందుకు చిన్నారులు స్టేడియంకు వచ్చారు.
Similar News
News April 23, 2025
విశాఖ పోలీసులను అభినందించిన నేపాల్ పోలీసులు

నేపాల్‌కు చెందిన ఓ మహిళ తప్పిపోయి విశాఖలో ఉన్నట్లు నేపాల్ పోలీసులు గమనించారు. ఈ మేరకు నేపాల్ పోలీసులు విశాఖ సీపీ చొరవతో గాజువాక పోలీసుల సహాయంతో ఆమె ఆచూకీని కనుగొన్నారు. అనంతరం ఆమెను వారి తల్లిదండ్రులకు క్షేమంగా అప్పగించారు. ఈ విషయమై మంగళవారం నేపాల్ పోలీసులు విశాఖ సీపీ, పోలీసులను అభినందిస్తూ లేఖ రాశారు. మిస్సింగ్ కేసును ఛేదించిన గాజువాక పోలీసులను సీపీ అభినందించారు.
News April 23, 2025
విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే రాజు

విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కేకే.రాజును నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న గుడివాడ అమర్నాథ్‌ను అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిగా నియమించారు. అయితే కేకే.రాజు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి రెండుసార్లు వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందరు.
News April 23, 2025
విశాఖ: నేడే పది ఫలితాలు.. ఒక్క క్లిక్‌తో..!

బుధవారం ఉదయం 10 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలు ప్రకటించనున్నారు. విశాఖలో 29,997 మంది పరీక్ష రాయగా వారిలో 15,094 మంది బాలురు, 13,429 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్ విద్యార్థులు 28,523 మంది, ఓపెన్ స్కూల్ 1,404 మంది, 2,124 వృత్తి విద్యా పరీక్ష రాశారు. 134 సెంటర్లలో పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఒక్క క్లిక్‌తో వే2న్యూస్‌లో ఫలితాలను సులభంగా తెలుసుకోవచ్చు. >Share it